PM Modi : కోవిడ్ రిలీఫ్ ప్యాకేజీపై స్పందించిన మోదీ
కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పలు రంగాలను ఆదుకునే చర్యల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Pm Modi (6)
PM Modi కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పలు రంగాలను ఆదుకునే చర్యల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యలతో ప్రజారోగ్య వసతులు మెరుగుపడతాయని,వైద్య మౌలిక రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని మోదీ తెలిపారు. మన చిన్నారుల కోసం ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి ఉంచఃబడిందని మోదీ తెలిపారు.
రైతుల సంక్షేమానికి ఉపకరించేలా ఉద్దీపన ప్యాకేజ్‌లో శ్రద్థ కనబరిచారని ప్రధాని పేర్కొన్నారు. చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి దోహదపడేలా ప్యాకేజ్‌లో పలు చర్యలు చేపట్టారని అన్నారు. టూరిజం రంగంలో ఉన్నవారికి ఆర్థిక సాయంతో పాటుగా పలు కీలక నిర్ణయాలు ప్యాకేజీ ద్వారా ప్రకటించబడ్డాయని ప్రధాని తెలిపారు.