PM Narendra Modi : అరబిక్‌లోకి రామాయణం, మహాభారతం.. అనువాదకుడిని ప్రశంసించిన మోదీ

అరబిక్ లోకి అనువదించి ప్రచురించిన మహాభారతం, రామాయణం రెండు పుస్తకాల కాపీలపై మోదీ సంతకం చేశారు.

PM Narendra Modi

PM Narendra Modi Kuwait Tour: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గల్ఫ్ దేశమైన కువైట్ వెళ్లారు. శనివారం కువైట్ లో అడుగు పెట్టిన మోదీకి ఘన స్వాగతం లభించింది. గత 43ఏళ్లలో భారత ప్రధాని కువైట్ లో పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే, కువైట్ పర్యటనలో భాగంగా రామాయణం, మహాభారతం గ్రంథాలను అరబిక్ భాషలోకి అనువదించి అబ్దుల్లా అల్ బరూన్, ఈ ఇతిహాసాల అరబిక్ వెర్షన్ లను ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్ లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భం మోదీ వారిని అభినందించారు.

Also Read: YouTube New Rules : భారతీయ క్రియేటర్లకు యూట్యూబ్ వార్నింగ్.. ఇకపై ఇలా టైటిల్స్, థంబునైల్స్ పెడితే వీడియోలను డిలీట్ చేస్తాం..!

అరబిక్ లోకి అనువదించి ప్రచురించిన మహాభారతం, రామాయణం రెండు పుస్తకాల కాపీలపై మోదీ సంతకం చేశారు. అనంతరం అబ్దుల్ లతీఫ్ అల్నెసెఫ్ మాట్లాడుతూ.. తాము అరబిక్ లో ప్రచురించిన రామాయణ, మహాభారత పుస్తకాలను ప్రధాని మోదీ చూసి సంతోషించారని, రెండు పుస్తకాలపై సంతకం చేశారని తెలిపారు. వీటి అనువాదానికి రెండేళ్లు పట్టిందని తెలిపారు.

Also Read: Maharashtra: సీఎం ఫడ్నవీస్ వద్దే హోంశాఖ.. షిండే, అజిత్ పవార్ శాఖలేమిటంటే?

ప్రధాని నరేంద్ర మోదీ వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఇతిహాసాలను అనువదించడంలో, ప్రచురించడంలో లబ్దుల్లా అల్ బరూన్, అబ్దుల్ అతీఫ్ అల్నెసెఫ్ లు చేసిన కృషికి నేను అభినందిస్తున్నాను. వారి చొరవ భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్త ప్రజాదరణను తెలియజేస్తుంది.’’ అని మోదీ పేర్కొన్నారు. అనువాదకుడు, ప్రచురుణకర్తతో కలిసిఉన్న ఫొటోలను మోదీ షేర్ చేశారు.