ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లాంచ్ చేసిన పీఎం మోడీ.. వారికి మాత్రమే ప్రత్యేకం

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లాంచ్ చేసిన పీఎం మోడీ.. వారికి మాత్రమే ప్రత్యేకం

pm-modi

Updated On : December 26, 2020 / 2:49 PM IST

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆయుష్మాన్ భారత్ స్కీంను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా లాంచ్ చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతవాసులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంను పొడిగించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ స్కీం కింద హెల్త్ కవరేజ్ తో పాటు ఫైనాన్షియల్ రిస్క్ ప్రొటెక్షన్, హెల్త్ సర్వీసెస్ ప్రొటెక్షన్ వంటివి సమకూరుతాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర పాలిత ప్రాంత గవర్నర్, మనోజ్ సిన్హాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం కింద కేంద్ర పాలిత ప్రాంతంలో ఉండే వారందరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అది కూడా దాదాపు రూ.5లక్షల వరకూ ఇస్తారన్నమాట.

ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) పొడిగింపులో భాగంగా.. దాదాపు 15లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అక్కడి ప్రాంతాల్లో ఉండే వారు పీఎం-జేఏవై స్కీం కింద ఎక్కడైనా సర్వీసులు పొందవచ్చని పీఎంఓ వెల్లడించింది.