లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభించిన మోడీ

వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని మోడీ ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు రూ.2వేల చొప్పున రూ.17 వేల కోట్లు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు ఇతర అధికారులు, రైతులు ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వ్యవసాయ ఉత్పత్తిలో కోత నిర్వహణ, మార్కెటింగ్ లెగ్‌లో 1 ట్రిలియన్ వ్యవసాయ మౌలిక ఫండ్.. ఈ పథకం రైతులకు మెరుగైన గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలను కల్పిస్తుందని చెప్పారు. గ్రామీణ భారతదేశంలో ఆహార ప్రాసెసింగ్, పంటకోత సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి సాయపడుతుందని మోడీ అన్నారు. 1,128 కోట్ల కొత్త రుణాలతో 2,200 కోఆపరేటివ్ సొసైటీలకు పంపిణీ ద్వారా ఈ ఫండ్ ప్రారంభమైంది.
ప్రధాన మంత్రి కూడా PM-కిసాన్ ప్రత్యక్ష ఆదాయం సాయం పథకం కింద రైతులకు 17,100 కోట్లను ట్రాన్స్ ఫర్ చేశారు. మౌలిక సదుపాయాల పథకం కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలు,
స్వయం సహాయక బృందాలు, వ్యవస్థాపకులు, స్టార్టప్‌లు, మౌలిక సదుపాయాల కల్పనలకు 1 ట్రిలియన్ల రుణాలను అందించనున్నాయి.
పంటకోత అవస్థాపన, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కమ్యూనిటీ ఆస్తుల కోసం మధ్యస్థ-దీర్ఘకాలిక రుణ ఫైనాన్సింగ్ అందించడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు. దీని మార్గదర్శకాలు ప్రకారం.. అన్ని రుణాలు 2 కోట్ల 3శాతం వడ్డీ రాయితీతో అందజేస్తారు.
2020-21లో రూ. 10,000 కోట్లు, రాబోయే మూడేళ్లలో రూ. 30,000 కోట్ల మంజూరుతో వచ్చే నాలుగేళ్లలో రుణాలు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోని ప్రాధమిక వ్యవసాయ రుణ సంఘాల రైతులతో మోడీ సంభాషించారు. సారవంతమైన నేల కోసం యూరియా వంటి రసాయన ఎరువులను వాడటం మానేయాలని మోడీ రైతులను కోరారు.