PM Modi says he entered politics holding your finger then pawar reply is
Sharad Pawar: తాన వేలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని అన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ చమత్కరించారు. దానికి ఇంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అనుకోలేదంటూ ఆయన వ్యంగ్యంగా స్పందించారు. మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ కూల్చడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందనే విమర్శలు ఉన్నాయి. అలాగే బీజేపీయేతర ప్రభుత్వాలను మోదీ-షాలు కూలుస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో పవార్ ఈ విధంగా స్పందించారు.
ప్రధానమంత్రి మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘శరద్ పవార్ వేలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాను’’ అని అన్నారు. కాగా, ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై మీ స్పందనేంటని పవార్‌ను ప్రవ్నించగా ‘‘దాని వల్ల ఇంతటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అప్పుడు అనుకోలేదు’’ అని చమత్కరించారు. కేంద్ర ప్రభుత్వంపై మోదీ పాలనపై విమర్శలు చేసే పవార్.. తాజా వ్యాఖ్యలో ఒకవేళ తానే మోదీకి రాజకీయాలు నేర్పించి ఉన్నట్లైతే మోదీ చేసే తప్పిదాలు, ప్రజారహిత, ప్రజాస్వామ్య రహిత విధానాలను పరోక్షంగా ప్రోత్సహించినట్లేననే అర్థంలో సమాధానం ఇచ్చారు.
Delhi Liquor Scam : పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసిన సీబీఐ
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘2014లో మంచి రోజులు తీసుకొస్తామని అన్నారు. గ్రామాలన్నింటినీ ఇంటర్నెట్తో అనుసంధానం చేయడంతో పాటు ప్రతి ఇంటికి టాయిలెట్లు నిర్మించడం, నీటి సదుపాయం కల్పించడం, విద్యుత్ అందించినప్పుడే మంచి వస్తాయి. కానీ ఇవేవీ చేయకుండానే మంచి రోజులు వచ్చాయని ప్రచారం చేసుకుంటున్నారు’’ అని విమర్శించారు.
ఇక 2024లో బీజేపీయేతర కూటమికి శరద్ పవార్ నాయకత్వం వహిస్తే బాగుంటుందని కొందరు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. విపక్షాల ప్రధాని అభ్యర్థిగా పవారే ఉండాలని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వయసుతో పాటు ఇతర కారణాల రిత్యా అందుకు పవార్ మొగ్గు చూపడం లేదు. బీజేపీయేతర పక్షాల ఐక్యతకు మాత్రం కృషి చేస్తానని ఆయన ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నారు.
Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా 50 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా..