Delhi Liquor Scam : పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో సీబీఐ దూకుడుమీదున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు చెందిన బ్యాంకు లాకర్లను కూడా పరిశీలించేందుకు సిద్ధపడ్డారు. దీంట్లో భాగంగా ఈరోజు మనీష్ సిసోడియాకు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేశారు సీబీఐ అధికారులు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.

Delhi Liquor Scam : పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసిన సీబీఐ

Delhi Liquor Scam case..

CBI Raids on Manish Sisodia..Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో సీబీఐ దూకుడుమీదున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు చెందిన బ్యాంకు లాకర్లను కూడా పరిశీలించేందుకు సిద్ధపడ్డారు. దీంట్లో భాగంగా ఈరోజు మనీష్ సిసోడియాకు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేశారు సీబీఐ అధికారులు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఘజియాబాద్ బ్యాంక్ లో సిసోడియా, ఆయన భార్య సమక్షంలో సీబీఐ అధికారులు బ్యాంకు లాకర్లను పరిశీలిస్తున్నారు. సీబీఐ దర్యాప్తుకు సిసోడియా పూర్తిగా సహకరిస్తున్నారు.

ఢిల్లీ ఆప్ స‌ర్కార్ పై లిక్కర్ స్కామ్ విషయంలో అవినీతి ఆరోప‌ణ‌లు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ 2021-22 అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సుమారు 15 మంది వ్యక్తులు, సంస్థల పై కేసు నమోదు చేసింది. ఈక్రమంలో 10 రోజుల క్రితం మ‌నీష్ ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వ‌హించింది. ఆగస్టు19న ఫెడరల్‌ ప్రోబ్‌ ఏజెన్సీ సిసోడియా నివాసంతో సహా సుమారు 31 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. పలు ప్రశ్నలు సంధించింది. సిసోడియాపై సీబీఐ విచార‌ణ కొనసాగుతోంది. ఈక్రమంలో మ‌నీష్ కు సంబంధించిన బ్యాంక్ లాక‌ర్ల‌ను సీబీఐ అధికారులు తెరిచి బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఈ లాక‌ర్‌లో ఎలాంటి డాక్యుమెంట్లు బ‌య‌ట‌ప‌డ‌తాయో చూడాలి.

ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ విధానంలో అవినీతి జ‌రిగింద‌నే నివేదిక‌ల ఆధారంగా సీబీఐ దాడులు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అవినీతిని అంతం చేస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చిన ఆప్, అవినీతిమ‌యంగా మారిపోయింద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సీబీఐ విచార‌ణ‌ పూర్తి అయ్యాకా ఆరోపణలు నిజమవుతాయా? లేదో వేచి చూడాలి.. ఇవి కేవలం తనపై బీజేపీ చేస్తున్న కుట్రమాత్రమేనని సీబీఐ తనిఖీల్లో ఏమి పట్టుబడలేదని సిసోడియా అంటున్నారు.