దంతెవాడ నక్సల్స్ దాడిని తీవ్రంగా ఖండించిన మోడీ

చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో మంగళవారం(ఏప్రిల్-9,2019) నక్సలైట్లు జరిపిన IED బ్లాస్ట్ లో  బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు.

  • Published By: venkaiahnaidu ,Published On : April 9, 2019 / 01:50 PM IST
దంతెవాడ నక్సల్స్ దాడిని తీవ్రంగా ఖండించిన మోడీ

Updated On : April 9, 2019 / 1:50 PM IST

చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో మంగళవారం(ఏప్రిల్-9,2019) నక్సలైట్లు జరిపిన IED బ్లాస్ట్ లో  బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు.

చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో మంగళవారం(ఏప్రిల్-9,2019) నక్సలైట్లు జరిపిన IED బ్లాస్ట్ లో  బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు. నక్సల్స్ దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు. నక్సల్స్ దాడిలో మరణించిన ఎమ్మెల్యే భీమ మండవి అంకితభావం కలిగిన బీజేపీ కార్యకర్త అని మోడీ అన్నారు. 
Read Also : నక్సల్స్ దాడిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి

పట్టుదలతో పనిచేసే ధైర్యము గల నేత భీమ అని తెలిపారు. చత్తీస్ ఘడ్ ప్రజలకు భీమ ఎంతో సేవ చేశారని అన్నారు. ఆయన మృతి తీవ్ర దిగ్భాంతి కల్గించిందని అన్నారు. భీమ కుటుంబానికి,మద్దతుదారులకు సానుభూతి తెలిపారు. ఈ దాడిలో అమరులైన సెక్యూరిటీ సిబ్బందికి మోడీ జోహార్లు అర్పించారు. అమరుల త్యాగాలు వృధా కానివ్వమన్నారు.ఓం శాంతి అంటూ మోడీ ట్వీట్ చేశారు.