దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరు సరిగ్గా లేదని, వీవీ ప్యాట్‌లను లెక్కించాలంటూ చంద్రబాబు.. జాతీయ నేతలతో కలిసి సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించని ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా చంద్రబాబు ఈవీఎంలపై చేస్తున్న విమర్శలపై మాట్లాడారు.
ఈవీఎంల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యక్తం చేసిన అనుమానాలు రాజకీయం మాత్రమేనని మోడీ అన్నారు. తొలి మూడు దశల పోలింగ్ సమయంలో చంద్రబాబు, కేసిఆర్‌లు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఇప్పుడు గాలి ఎటు వీస్తుందో తెలియడంతో ఈవీఎంలపై నిందలు వేస్తున్నారని విమర్శించారు.
క్రికెట్‌లో కొన్నిసార్లు అవుట్ అయిన బ్యాట్స్‌మెన్ అంపైర్‌ను తప్పుబట్టినట్టు, ఎన్నికల సంఘాన్ని వీళ్లు తప్పుబడుతున్నారని మోడీ కౌంటర్ వేశారు. అలాగే కేసిఆర్ మొదట్లో ఎగిరి ఇప్పుడు అపోజిషన్ నేతలను కలుస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు.