Kumbh Mela: కుంభమేళాలో ప్రధాని మోదీ.. బోటులో వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం.. వీడియో

ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు.

PM Modi

Kumbh Mela: ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. తొలుత ప్రయాగ్ రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచి అరైల్ ఘాట్ కు వెళ్లారు. అక్కడి నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యస్నానం ఆచరించారు. బోటులో ప్రధాని నరేంద్ర మోదీ వెంట యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఉన్నారు.

Also Read: Maha Kumbh Mela 2025 : వావ్.. ఇది నిజంగా అద్భుతం..! కుంభమేళాకి కోట్ల మంది జనం వస్తున్నా స్వచ్ఛత తగ్గని గాలి.. ఇదెలా సాధ్యమంటే..

యమునా నదిలో అరైల్ ఘాట్ నుంచి సంగం ఘాట్ వరకూ బోటు ప్రయాణించిన మోదీ.. స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు బోటు నుంచే అభివాదం చేశారు. సంగం ఘాట్ వద్ద పుణ్య స్నానం ఆచరించే ముందు గంగమ్మకు ప్రార్దనలు చేశారు. పుణ్యస్నానం అనంతరం త్రివేణి సంగమం వద్ద మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేశారు. ఆ తరువాత సాధు సంతువులతో సమావేశం అవుతారు.

జనవరి 13వ తేదీన ప్రారంభమైన కుంభమేళా.. ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజున ముగియనుంది. 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు దాదాపు 50కోట్ల మంది భక్తులు హాజరవుతారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. కుంభమేళా ప్రారంభమైన రోజు నుంచి ఫిబ్రవరి 4 (మంగళవారం) వరకు 39కోట్ల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇవాళ (బుధవారం) ఉదయం 37లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.