Maha Kumbh Mela 2025 : వావ్.. ఇది నిజంగా అద్భుతం..! కుంభమేళాకి కోట్ల మంది జనం వస్తున్నా స్వచ్ఛత తగ్గని గాలి.. ఇదెలా సాధ్యమంటే..
ఈ టెక్నిక్ ను గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రశంసించడం జరిగింది.

Maha Kumbh Mela 2025 : కుంభమేళాకి కోట్ల మంది జనం వస్తున్నారు. అయినా అక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదు. పైగా గాలి స్వచ్చత తగ్గలేదు. ఇదెలా సాధ్యం అంటే.. జపాన్ టెక్నాలజీ మియవాకీ. అసలేంటీ మియవాకీ అనే వివరాల్లోకి వెళితే..
రూ.6 కోట్లతో చిట్టడివి నిర్మాణం..
కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ రెండేళ్ల క్రితమే సన్నద్ధమైంది. ఆ ఫలితమే ప్రయాగ్ రాజ్ లో స్వచ్చమైన వాతావరణం చోటు చేసుకుందని చెబుతున్నారు. అసలు కోట్లాది మంది వచ్చి మునకలు వేసినా.. ఎలాంటి కాలుష్యం దరి చేరకుండా జపనీస్ సాంకేతికతను వాడుతున్నారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ 2023 లోనే మియవాకీ అనే జపాన్ టెక్నాలజీతో ప్రయాగ్ రాజ్ పరిధిలో ఓ చిన్నసైజ్ అడవిని తయారు చేసింది.
18.50 ఎకరాలు, 63 రకాలు, 5 లక్షల మొక్కలు..
నగరంలో పలు చోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు నాటారు. ఆ మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదిగి ప్రతిరోజూ స్వచ్చమైన ఆక్సిజన్ ను వాతావరణంలోకి వదులుతున్నాయి. మియావాకీ టెక్నిక్ తో ఇదంతా సాకారం చేయడానికి ప్రయాగ్ రాజ్ మున్సిపాలిటీ 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పెంచడమే మియావాకీ టెక్నిక్ ప్రత్యేకత. ఈ టెక్నిక్ ను గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రశంసించడం జరిగింది.
Also Read : ఈ రెండు దిశలలో మొక్కలు ఎందుకు ఉంచకూడదో తెలుసా? వాస్తుశాస్త్రం ఏం చెబుతుందంటే?
ఆక్సిజన్ ను వదులుతున్న చెట్లు..
మియావాకీలో భాగంగా మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు తదితర 63 రకాల చెట్లను పెంచుతారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్వహణ కాంట్రాక్ట్ ను మూడేళ్ల పాటు ఓ కంపెనీకి అప్పగించింది. అదిప్పుడు ఫలితం చూపింది. ఆ చెట్లు ఆక్సిజన్ ను వాతావరణంలోకి వదులుతున్న కారణంగా..ఇక్కడి గాలి స్వచ్చత కలిగి ఉండగా.. చుట్టుపక్కల ఆధ్యాత్మిక వాతావరణం దానికి మరింత శోభను చేకూరుస్తోంది.