PM Narendra Modi Attends Anant Ambani-Radhika Merchant's 'Shubh Aashirwad' Ceremony ( Image Source : Google )
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ నవ వధూవరులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ‘ శుభ్ ఆశీర్వాద్’ (ఆశీర్వాద వేడుక)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను మోదీ ఆశీర్వదించారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
అంబానీ వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన ‘శుభ్ ఆశీర్వాద్’కి బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు, అంతర్జాతీయ ప్రముఖులు, ఇతర ప్రజా ప్రముఖులు హాజరయ్యారు. ఆదివారం రోజున ‘మంగళ ఉత్సవ్’ లేదా వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో రూ. 29వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం శంకుస్థాపన చేశారు. వీటిలో రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులు ఉన్నాయి.
Read Also : Ram Setu Map : రామసేతు మొదటి సముద్రగర్భ మ్యాప్.. రహస్యాలు వెలికితీసిన ఇస్రో సైంటిస్టులు