Ram Setu Map : రామసేతు మొదటి సముద్రగర్భ మ్యాప్.. రహస్యాలు వెలికితీసిన ఇస్రో సైంటిస్టులు

Ram Setu Map : ఎన్నో ఏళ్ల క్రితం నీట మునిగిన ఈ రామసేతువుకు సంబంధించిన పూర్తి మ్యాప్‌ను ఇస్రో సైంటిస్టులు ఆవిష్కరించారు. అంతేకాదు.. రామసేతు రహస్యాలను కూడా వెలికితీశారు.

Ram Setu Map : రామసేతు మొదటి సముద్రగర్భ మ్యాప్.. రహస్యాలు వెలికితీసిన ఇస్రో సైంటిస్టులు

ISRO scientists create the first undersea map of Ram Setu ( Image Source : Google )

Ram Setu Map : భారత్, శ్రీలంక మధ్య ఉన్న అత్యంత పురాతనమైన వంతెన రామసేతును ప్రముఖ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్నో ఏళ్ల క్రితం నీట మునిగిన ఈ రామసేతువుకు సంబంధించిన పూర్తి మ్యాప్‌ను ఇస్రో సైంటిస్టులు ఆవిష్కరించారు.

అంతేకాదు.. రామసేతు రహస్యాలను కూడా వెలికితీశారు. అయితే, రామ సేతును అప్పట్లో ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలిచేవారు. మొత్తం వంతెనను 10 మీటర్ల రిజల్యూషన్ మ్యాప్ ద్వారా చూడవచ్చు. దీని డేటా అక్టోబర్ 2018 నుంచి అక్టోబర్ 2023 మధ్య 6 సంవత్సరాల కాల వ్యవధిలో డేటాను సేకరించారు.

Read Also : Xiaomi SU7 Electric Car : షావోమీ ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌‌తో 800 కి.మీ దూసుకెళ్తుంది!

సముద్ర గర్భ మ్యాప్‌లో ఇది మొదటిది :
29 మీటర్ల పొడవు, సముద్రగర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో ఉన్న సముద్రగర్భ మ్యాప్‌లో ఇది మొదటిది. ఇస్రో జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు ప్రచురించిన ఒక పత్రికలో “నాసా శాటిలైట్ (ICESat-2) నీటిలో చొచ్చుకుపోయిన ఫోటాన్‌లను ఉపయోగించి ఆడమ్స్ వంతెన గురించి క్లిష్టమైన వివరాలను అందించిన మొదటిది ఈ నివేదిక. మా పరిశోధనలు ఆడమ్స్ బ్రిడ్జ్ మూలాన్ని అర్థం చేసుకోవడంలో సాయపడ్డాయి. ఈ ప్రాంతంలో నీరు చాలా తక్కువగా ఉన్నందున షిప్ మ్యాపింగ్ కష్టంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

అధునాతన లేజర్ టెక్నాలజీతో మ్యాప్ :
ఇంతకుముందు ఈ వంతెన కోసం జరిగిన పరిశోధనలో ఎత్తైన భాగాలకు పరిమితమైంది. అయితే, ఐసీఈసాట్-2 లేజర్ పరిశోధకులకు నీటి భాగంలో లోతుగా చొచ్చుకుపోవడానికి సాయపడింది. దీని మార్గం 99.8శాతం నిస్సారమైన, అతి-నిస్సారమైన నీటిలో మునిగిపోయిందని ఆప్టికల్ శాటిలైట్ ఫొటో ధృవీకరిస్తుంది. ఈ మ్యాప్‌ను రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా శాటిలైట్ నుంచి అధునాతన లేజర్ టెక్నాలజీని ఉపయోగించారు. గిరిబాబు దండాబత్తుల నేతృత్వంలోని బృందం 2 నుంచి 3 మీటర్ల లోతుతో గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి మధ్య నీటి ప్రవాహాన్ని అనుమతించే మొత్తం 11 ఇరుకైన ఛానళ్లను ఇస్రో కనుగొంది.

ఆలయ రికార్డుల ప్రకారం.. :
నీటి అడుగున ఉన్న శిఖరం సున్నపురాయి గుంటల గొలుసుతో తయారైంది. వంతెన ప్రస్తుత భౌతిక లక్షణాలను గుర్తించడానికి బృందం ఆకృతులు, వాలు విశ్లేషణ, వాల్యూమెట్రిక్స్ వంటి 3-డీ పారామితులను ఉపయోగించింది. ఈ పురాతన వంతెన భారత్‌లోని ధనుష్కోడిని శ్రీలంకలోని తలైమన్నార్ ద్వీపాన్ని కలుపుతుంది. రామాయణంలో ఈ వంతెన ప్రస్తావన ఉన్నందున రామసేతు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

రాముడి వానర్ సేన లంకకు చేరుకోవడానికి దీనిని ఉపయోగించారు. రావణుడు సీతను అపహరించిన తర్వాత ఆమెను అక్కడ ఉంచాడు. క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను ‘సేతు బంధై’ అని పిలిచేవారు. రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం.. ఈ వంతెన 1480 వరకు తుఫాను వల్ల ధ్వంసమయ్యే వరకు సముద్ర మట్టానికి పైన ఉండేది.

Read Also : Poco M6 Plus 5G Launch : పోకో M6 ప్లస్ 5జీ ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?