కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారితో మోదీ కీలక వ్యాఖ్యలు

Narendra Modi: కేటాయించిన శాఖలపై పట్టు సాధించాలని అన్నారు. నాలుగు రోజుల పాటు శాఖలపై సమీక్షలు చేయాలని చెప్పారు.

కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారితో మోదీ కీలక వ్యాఖ్యలు

Updated On : June 9, 2024 / 4:30 PM IST

కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారితో నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలతో మోదీ ఇవాళ సంభాషించారు. హంగు, ఆర్భాటలకు వెళ్లవద్దని చెప్పారు.

ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని మోదీ సూచించారు. కేటాయించిన శాఖలపై పట్టు సాధించాలని అన్నారు. నాలుగు రోజుల పాటు శాఖలపై సమీక్షలు చేయాలని చెప్పారు. మిగిలిన మూడు రోజులు మీ నియోజకవర్గానికి కేటాయించాలని అన్నారు.

కాగా, మోదీ క్యాబినెట్లోనూ మళ్లీ కొనసాగే కేంద్ర మంత్రులు ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఎస్.జైశంకర్ రెండోసారి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వరుసగా మూడోసారి అదే శాఖలో కొనసాగనున్నారు. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, తదితరులు మళ్లీ క్యాబినెట్‌లో ఉండనున్నారు.

వైసీపీ అందుకే ఓడిపోయింది: జగన్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్