Pariksha Pe Charcha 2021: మీ భయం పొగొడతా.. రాత్రి 7గంటలకు విద్యార్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి

విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం ఇవాళ( ఏప్రిల్‌ 7,2021) రాత్రి ఏడు గంటలకు జరగనుంది. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు మోదీ ఫిబ్రవరిలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

Pariksha Pe Charcha 2021 : విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం ఇవాళ( ఏప్రిల్‌ 7,2021) రాత్రి ఏడు గంటలకు జరగనుంది. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు మోదీ ఫిబ్రవరిలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

‘ఈ సారి పరీక్షా పే చర్చ కార్యక్రమం కొత్త పద్దతిలో జరగనుంది. విభిన్న అంశాలపై ఆసక్తికరమైన ప్రశ్నలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే చర్చ జరగనుంది. ఏప్రిల్‌ 7వ తేదీన రాత్రి 7గంటలకు జరిగే చర్చను అందరూ వీక్షించండి’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న ఢిల్లీలో తొలిసారి నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి, పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు.

ఏటా విద్యార్థుల పరీక్షలకు ముందు ‘పరీక్షా పే చర్చ’ నిర్వహిస్తున్నారు. నాలుగో ఎడిషన్ కార్యక్రమం ఈ రోజు జరగనుంది. పరీక్షలు రాయనున్న తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులల్లో భయాందోళనలను తొలగించడానికి 2018 నుంచి ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం దూరదర్శన్, ఆకాశవాణిలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఏటా జనవరిలో జరిగే ఈ కార్యక్రమం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడింది. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్‌ పద్ధతిలో ప్రధానమోదీ.. విద్యార్థులతో సంభాషించనున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో ఉండే భయాలను పొగొట్టేందుకు మూడేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు