PM Smartphone Yojana : దేశ ప్రజలందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్న మోదీ ప్రభుత్వం- క్లారిటీ ఇచ్చిన కేంద్రం

PM Smartphone Yojana : ప్రధానమంత్రి స్మార్ట్ ఫోన్ యోజన-2023 స్కీమ్ కింద దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్లను కేంద్రం ఇవ్వనుందట. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో విడుదల చేసింది.

PM Smartphone Yojana (Photo : Twitter)

PM Smartphone Yojana : సోషల్ మీడియా పుణ్యమా అని ఫేక్ న్యూస్ ల సంఖ్య బాగా పెరిగిపోయింది. అవాస్తవాలు, మిస్ లీడ్ చేసే సమాచారం, అసత్య ప్రచారాలు పెరిగాయి. ఏది నిజం? ఏది అబద్దం? అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ఫేక్ న్యూస్ ల గోల పెరిగిపోయింది. మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ మేసేజ్ లు, ఫేక్ లింక్స్ తో అమాయకులను దోచుకుంటున్నారు. ఆ లింక్స్ పై క్లిక్ చేశామో.. ఖతం.. మన బ్యాంకు ఖాతాలోని డబ్బంతా మాయం అవడం ఖాయం.

Also Read..Provident Fund Scam : కొత్త పీఎఫ్ స్కామ్‌తో జాగ్రత్త.. ఈ యాప్ డౌన్‌లోడ్ చేయగానే.. అకౌంట్లో రూ.80వేలు మాయం.. అసలేం ఏమైందంటే?

తాజాగా అలాంటి ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే.. ప్రధానమంత్రి స్మార్ట్ ఫోన్ యోజన-2023 స్కీమ్ కింద దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్లను కేంద్రం ఇవ్వనుందట. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో విడుదల చేసింది. ఇది నిజమేనేమో అని అంతా నమ్మేశారు. దాంతో వీడియో బాగా వైరల్ అయ్యింది.

Also Read..Google Android Apps : గూగుల్ ప్లే స్టోర్‌లో 36 డేంజరస్ యాప్స్ బ్యాన్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే ఇప్పుడే డిలీట్ చేయండి..!

ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIBFactCheck స్పందించింది. ఆ వీడియోలోని సమాచారాన్ని ఖండించింది. అందులో నిజం లేదని చెప్పింది. అదొక ఫ్రాడ్ అని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని తేల్చి చెప్పింది. అంతేకాదు, ఇలాంటి వాటిని నమ్మొద్దని సూచించింది. ప్రధానమంత్రి స్మార్ట్ ఫోన్ యోజన పేరుతో అసలు ఎలాంటి స్కీమ్ ను కేంద్రం తీసుకురాలేదని చెప్పింది. అంతేకాదు, అదసలు స్కీమ్ కాదు స్కామ్ అని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.