Google Android Apps : గూగుల్ ప్లే స్టోర్‌లో 36 డేంజరస్ యాప్స్ బ్యాన్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే ఇప్పుడే డిలీట్ చేయండి..!

Google Android Apps : మీ ఫోన్‌లో ఈ యాప్స్ వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ప్లే స్టోర్‌ (Play Store)లో 36 డేంజరస్ ఆండ్రాయిడ్ యాప్స్‌ (Android Apps) బ్యాన్ చేసింది గూగుల్. మీ ఫోన్‌లో ఉంటే ఇప్పుడే డిలీట్ చేసుకోండి.

Google Android Apps : గూగుల్ ప్లే స్టోర్‌లో 36 డేంజరస్ యాప్స్ బ్యాన్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే ఇప్పుడే డిలీట్ చేయండి..!

Google bans 36 malicious Android apps with over 100 million downloads on Play Store

Google Android Apps : ప్రముఖ గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి 36 డేంజరస్ ఆండ్రాయిడ్ యాప్‌లను బ్యాన్ చేసింది. ఈ హానికరమైన యాప్స్ మొదట మెకాఫీ (McAfee) గుర్తించింది. డేంజరస్ కొన్ని అప్లికేషన్‌లు ఇప్పుడే అప్‌డేట్ అయ్యాయి. ఆండ్రాయిడ్ యూజర్లకు పెద్ద ముప్పుగా పరిణమించే యాప్‌ల గ్రూపును కంపెనీ పరిశోధనా బృందం కనుగొంది.

ఎందుకంటే.. స్మార్ట్‌ఫోన్ యూజర్ అనుమతి లేకుండానే కొన్ని యాప్స్ రన్ అవుతుంటాయి. McAfee నివేదిక ప్రకారం.. కంపెనీ బృందం ఒక సాఫ్ట్‌వేర్ లైబ్రరీని కనుగొంది. అందులో గోల్డోసన్.. ఈ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌ల లిస్టును, సమీపంలోని GPS లొకేషన్లతో సహా Wi-Fi, బ్లూటూత్ డివైజ్‌ల గ్రూపును సేకరించగలదని కంపెనీ చెబుతోంది. దీనికి అదనంగా, లైబ్రరీ యూజర్ అనుమతి లేకుండా నేపథ్యంలో యాడ్స్ క్లిక్ చేయడం ద్వారా యాడ్ ఫ్రాడ్ కూడా చేయగలదని గుర్తించారు.

Read Also : Dangerous Android Apps : గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజరస్ ఆండ్రాయిడ్ యాప్స్.. మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే.. ఇప్పుడే డిలీట్ చేసేయండి..!

ఈ థర్డ్-పార్టీ డేంజరస్ లైబ్రరీతో 60 కన్నా ఎక్కువ యాప్‌లను కంపెనీ కనుగొంది. ఈ స్టోర్, గూగుల్ ప్లే యాప్‌లో 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది. దీన్ని అనుసరించి, (Google Play Store) నుంచి కొన్ని హానికరమైన యాప్‌లను నిషేధించింది. 60 యాప్‌లలో 36 యాప్‌లను కంపెనీ బ్యాన్ చేసింది. మిగిలినవి అప్‌డేట్ అయినట్టు గూగుల్‌కు రిపోర్టు చేసినట్టు నివేదిక పేర్కొంది. (Google) యాప్‌లు (Google Play) విధానాలను ఉల్లంఘిస్తున్నాయని డెవలపర్‌లకు గూగుల్ తెలిపింది.

Google bans 36 malicious Android apps with over 100 million downloads on Play Store

Google bans 36 malicious Android apps with over 100 million downloads on Play Store

InfinitySolitaire, Snake Ball Lover, Swipe Brick Breaker 2, UBhind: Mobile Tracker Manager, Bounce Brick Breaker, Infinite Slice, Compass 9: Smart Compass మరిన్ని వంటి యాప్‌లు Google Play Store నుంచి తొలగించింది. యూజర్ల యాప్‌ల పూర్తి లిస్టును చూడవచ్చు.Money Manager Expense & Budget, GOM Player, Korea Subway Info: Metroid, Money Manager మరిన్ని యాప్‌ల డెవలపర్‌లు అప్‌డేట్ చేసినట్టు గుర్తించారు. బ్యాన్ చేసిన అనేక యాప్‌లు ప్లే స్టోర్‌లో కనిపించనప్పటికీ.. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు పెద్ద ముప్పుగా చెప్పవచ్చు.

ఎందుకంటే.. ఇప్పటికే ఈ డేంజరస్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే.. లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. ఫోన్లలో ఆయా యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని యూజర్లకు సూచించింది. అదనంగా, గూగుల్ యూజర్లు Play Store లేదా ఏదైనా ఇతర థర్డ్ పార్టీ సర్వీసు నుంచి ఏదైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మొదట డెవలపర్ పేరు, డౌన్‌లోడ్‌ల సంఖ్య, డెవలపర్ ఎన్ని యాప్‌లను క్రియేట్ చేశారు, ఇమేజ్‌లు అసలైనవా లేదా ఫేక్ అని తెలుసుకోవడానికి యాప్‌లోని ప్రివ్యూ విభాగాన్ని చెక్ చేయాలి. స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు అది సేఫ్ కాదో లేదో సరిగ్గా చెక్ చేయాలని సూచించారు.

Read Also : Apple iphones List : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఈ ఐఫోన్ మోడల్స్ కనిపించవు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!