ఖాకీ సినిమా సీన్‌లా ఉంది.. 148 కిలోమీటర్లు ఛేజ్ చేసి లారీ డ్రైవర్‌ను పట్టుకున్న పోలీసులు.. ఇంతకీ అతడేం చేశాడో తెలుసా?

పోలీసులు లారీ డ్రైవర్ ను పట్టుకొనేందుకు దాదాపు 148 కిలో మీటర్లు ఛేజ్ చేశారు. ఈ క్రమంలో సదరు లారీ డ్రైవర్ పలు వాహనాలను ఢీకొట్టడంతోపాటు..

police vehicles damaged

Madhya Pradesh: భోపాల్‌లోని లాల్‌ఘటి ప్రాంతంలో ఖాకీ సినిమా తరహా సీన్ చోటు చేసుకుంది. పోలీసులు లారీ డ్రైవర్ ను పట్టుకొనేందుకు దాదాపు 148 కిలో మీటర్లు ఛేజ్ చేశారు. ఈ క్రమంలో సదరు లారీ డ్రైవర్ పలు వాహనాలను ఢీకొట్టడంతోపాటు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లనుసైతం ఢీకొట్టుకుంటూ పరారయ్యాడు. చివరికి రాజ్ గఢ్ జిల్లాలోని బియోరా దేవాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడిని పట్టుకున్నారు. ఇంతకీ ఆ లారీ డ్రైవర్ ఏం చేశాడనే వివరాల్లోకి వెళితే..

Also Read: Gachibowli Gun Firing: బాబోయ్.. ఇన్ని కేసులా.. గచ్చిబౌలి కాల్పుల ఘటనలో కీలక అప్డేట్.. పబ్‌‌లో ఎంజాయ్ చేస్తూ..

లారీ డ్రైవర్ పేరు అజయ్ మాలవీయ. కోల్ కతాలో ఉల్లిపాయల లోడ్ తో షుజల్‌పూర్‌కు వెళ్తున్నాడు. భోపాల్ లో మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీడి శర్మ వాహనాన్ని మాలవీయ ఢీకొట్టాడు. ఆ తరువాత లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో బీజేపీ నేత భద్రతా సిబ్బంది పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకిదిగి భోపాల్ లోని గాంధీ నగర్ లో బారికేడ్లు ఏర్పాటు చేసి లారీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, లారీ డ్రైవర్ మాలవీయ బారికేడ్లను ఢీకొట్టి పారిపోయాడు. ఆ తరువాత పోలీసులు అతని లారీని వెంబడించగా వారికి దొరక్కుండా మాలవీయ పరారయ్యాడు. ఈ క్రమంలో కచ్నారియా టోల్ ప్లాజా వద్ద కురావల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది లారీని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని ఢీకొట్టి పారిపోయేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి.

Also Read: Cm Chandrababu Naidu : ఓ మై గాడ్.. ఇతడి జీతం ఎంతో తెలిసి ఏకంగా సీఎం చంద్రబాబే షాకయ్యారుగా.. ఆ తర్వాత ఎంత రచ్చ జరిగిందంటే..

రాజ్‌గఢ్ జిల్లాలోని పచోర్ సమీపంలోని ఉదంఖేడి టోల్ ప్లాజా వద్ద ట్రక్కును ఆపి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ ఛేజింగ్ లో లారీ డ్రైవర్ పలు ప్రైవేట్ వాహనాలతో పాటు ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎనిమిది పోలీసు వాహనాలను ఢీకొట్టి ద్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. అయితే, అతడు మద్యం సేవించి లారీని నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.