Gachibowli Gun Firing: బాబోయ్.. ఇన్ని కేసులా.. గచ్చిబౌలి కాల్పుల ఘటనలో కీలక అప్డేట్.. పబ్‌లో ఎంజాయ్ చేస్తూ..
మోస్ట్ వాటెండ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ది చిత్తూరు జిల్లా. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతనిపై కేసులు ఉన్నాయి.

Most Wanted Criminal Bathula Prabhakar
Gachibowli Gun Firing: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో కాల్పుల ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మోస్ట్ వాటెండ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ పై ఇప్పటికే 80 కేసులు ఉన్నాయి. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 16 కేసులు ఉన్నాయి. 2023 నవంబర్ నుంచి ప్రభాకర్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. మెయినాబాద్ చోరీ కేసులో ప్రభాకర్ వేలిముద్రలు గుర్తించిన పోలీసులు.. ఆ డేటాతో సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. అయితే, కొద్దిరోజులుగా ప్రభాకర్ తప్పించుకుని తిరుగుతున్నాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్కులు ధరిస్తూ ఎస్కేప్ వుతున్నాడు. దీంతో పోలీసులు ప్రభాకర్ కదలికలపై నిఘా పెట్టారు. ప్రభాకర్ రెగ్యులర్ గా పబ్ లకు వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు.. మాదాపూర్ జోన్ పరిధిలో అన్ని పబ్ ల వద్ద నిఘా పెట్టారు. చివరికి సాహసోపేతంగా అతని ఆటకట్టించారు.
శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కు మోస్ట్ వాటెండ్ క్రిమినల్ ప్రభాకర్ వచ్చినట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ సీసీఎస్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడి వెళ్లారు. పబ్ నుంచి బయటకు వస్తున్న నిందితుడిని పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించగా అతనిపై కాల్పులు జరిపాడు. కానిస్టేబుల్ తప్పించుకొని ఆ వెంటనే పబ్ బౌన్సర్ల సాయంతో ప్రభాకర్ ను పట్టుకున్నారు. ఆ తరువాత అతని వద్ద గన్ స్వాధీనం చేసుకున్నాడు. అయితే, నిందితుడి వద్ద మరో గన్ ఉండటంతో ఆ గన్ తో కానిస్టేబుల్ పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ కానిస్టేబుల్ ఎడమ కాలు పాదంలో నుంచి బయటకు దూసుకెళ్లింది. అప్రమత్తమైన మిగిలిన పోలీసులు ప్రభాకర్ వద్ద రెండో గన్ ను స్వాధీనం చేసుకొని విచారణ నిమిత్తం రహస్య ప్రాంతానికి తరలించారు. గాయపడిన కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలించారు.
మోస్ట్ వాటెండ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ది చిత్తూరు జిల్లా. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతనిపై 80 కేసులు ఉన్నాయి. గత రెండేళ్లుగా ప్రభాకర్ ను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. అయితే, నిందితుడు ఇంజినీరింగ్ కాలేజీలను టార్గెట్ చేసి దొంతనాలు చేస్తున్నట్లు, అడ్మిషన్లు, పరీక్షలు, హాస్టల్ ఫీజుల రూపంలో వచ్చిన డబ్బును కాలేజీలో పెడతారని వాటిని సులభంగా దొంగతనం చేయవచ్చునని భావించి టార్గెట్ చేసుకొని దొంగతనం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. 2022లో ప్రభాకర్ ను అనకాపల్లి కోర్టు నుంచి వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా తప్పింకున్నాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఆ తరువాత సైబరాబాద్, హైదరాబాద్ లలో దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు.
ఇటీవల మోయినాబాద్ లో జరిగిన ఒక దొంగతనం కేసులో పోలీసులకు ప్రభాకర్ వేలిముద్రలు దొరికాయి. దీంతో ప్రభాకర్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అతడు తరచూ పబ్ లకు వచ్చి వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకున్నారు. పబ్ లలో నిఘా పెట్టగా సీసీ కెమెరాల్లో చిక్కకుండా మాస్కులు ధరిస్తూ, మకాం మారుస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి పక్కా సమాచారంతో మాదాపూర్ సీసీఎస్ పోలీసులు ప్రిజం పబ్ కు వెళ్లారు. అక్కడ ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రభాకర్ ను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది.