Earth Rotation: భూమి ఎలా తిరుగుతుందో చూశారా..? భారతీయ శాస్త్రవేత్త తీసిన అద్భుత వీడియో వైరల్.. మీరూ చూడాల్సిందే..

భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో భూమి ఎలా తిరుగుతుందో స్పష్టంగా కనిపిస్తోంది.

Earth Rotation: భూమి ఎలా తిరుగుతుందో చూశారా..? భారతీయ శాస్త్రవేత్త తీసిన అద్భుత వీడియో వైరల్.. మీరూ చూడాల్సిందే..

Earth rotation video

Updated On : February 2, 2025 / 8:14 AM IST

Earth Rotation: భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనం అనేక పుస్తకాల్లో చదువుకున్నాం. దానినే భూభ్రమణం అంటారు. ఆ భూమి ఎలా తిరుగుతుందో మీరు ఎప్పుడైనా చూశారా.. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు చూడొచ్చు. ఇది తీసింది.. ఇతర దేశాల శాస్త్రవేత్తలు కాదు.. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్ చుక్. ఆయన గడ్డకట్టే చలిలో రిస్క్ తీసుకొని లద్దాఖ్ లో భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్‌లాప్స్‌లో బంధించారు.

Also Raed: Gold Rate: బాబోయ్.. రూ.85వేలు దాటిన గోల్డ్ రేటు.. ఏప్రిల్ తర్వాత బంగారం కొనేవాళ్లకి లక్కీఛాన్స్.. ఎందుకంటే?

డోర్జే అంగ్‌చుక్ హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఇంజనీర్ -ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు. భూ భ్రమణం గురించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా వీడియో రూపొందించాలని తనకు అభ్యర్థన రావడంతో ఆ మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టాడు. ఇందుకోసం లద్దాఖ్ లోని విపరీతమైన చలిలోనూ వీడియో చిత్రీకరించాడు. ఇందుకోసం నాలుగు రాత్రుల్లో పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు, టైమర్ పని చేయకపోవడం వంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా చివరి అనేక కష్టాలను అధిగమించి భూమి పరిభ్రమిస్తున్న దృశ్యాలను వీడియోలో బంధించాడు. దానిని ఒక నిమిషం వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

Also Read: PropEquity Report : వచ్చే ఐదేళ్లలో ఈ 9 ప్రధాన నగరాల్లో కోటిన్నర ఇళ్లకు భారీ డిమాండ్- ప్రాప్ ఈక్విటీ రిపోర్టులో ఆసక్తికర విషయాలు

డోర్జే అంగ్‌చుక్ షేర్ చేసిన వీడియోలో భూమి ఎలా తిరుగుతుందో స్పష్టంగా కనిపిస్తోంది. అంగ్‌చుక్ మాట్లాడుతూ.. నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే, భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని తెలిపారు. ఈ వీడియోలో బంధించడానికి అనేక కష్టాలను అధిగమించాల్సి వచ్చినట్లు తెలిపాడు. తాను వీడియో చిత్రీకరణ సమయంలో కెమెరా స్టోరేజ్, బ్యాటరీ వైఫల్యం, టైమర్ పనిచేయకపోవటం వంటి అనేక సవాళ్లతో నాలుగు రాత్రుల పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొనన్నాని చెప్పాడు. ఒక దశలో ఈ ప్రాజెక్టును విరమించుకోవాలని భావించానని.. కానీ, 24గంటల పాటు టైమ్ లాప్స్ ను ఉపయోగించి ఈ వీడియో తీయడం జరిగిందని చెప్పారు. అయితే, అంగ్‌చుక్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 

A Day in Motion – Capturing Earth’s Rotation