Gold Rate: బాబోయ్.. రూ.85వేలు దాటిన గోల్డ్ రేటు.. ఏప్రిల్ తర్వాత బంగారం కొనేవాళ్లకి లక్కీఛాన్స్.. ఎందుకంటే?
బంగారం కొనుగోలుదారులకు ధరలు షాకిస్తున్నాయి. శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్రం బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే.

Gold
Gold Rate: బంగారం కొనుగోలుదారులకు ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు ఆకాశమే హద్దుగా గోల్డ్ రేటు పెరుగుతుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తరువాత బంగారం, వెండి ధరలు తగ్గుతాయని అందరూ ఆశించారు. కానీ, ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 85,020గా నమోదు కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ. 78,050 వద్ద కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని తగ్గించింది. దీంతో కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశమే. అయితే, ధరలు తగ్గుముఖం పట్టాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందేనని తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని 15శాతం నుంచి 6శాతానికి తగ్గించారు. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి ఈ పరిణామం శుభవార్తే అని చెప్పొచ్చు. కేంద్రం బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని తగ్గించడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. గోల్డ్, సిల్వర్ లిక్విడిటీ పెంచేందుకు ఇలా కస్టమ్ డ్యూటీని తగ్గించారు. దీంతో వ్యాపారులు ఎక్కువ మొత్తంలో బంగారంను దిగుమతి చేసుకుంటారు. ఇల్లీగల్ దిగుమతులు కూడా తగ్గిపోతాయి. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి గోల్డ్ కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో నగల తయారీ రంగం కూడా ఊపందుకుంటుంది.
కేంద్రం కస్టమ్ డ్యూటీ 15 నుంచి 6శాతంకు తగ్గించడం ద్వారా బంగారం దిగుమతులు పెరిగే అవకాశం ఉంది. అదే సందర్భంలో జ్యువెలరీ రూపంలో ఎగుమతులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో గోల్డ్ కు డిమాండ్ మరింత పెరుగుతుంది. అయితే, వ్యాపారులు ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తే ఏప్రిల్ లోపు వారికి చేరుతాయి. దీంతో ఏప్రిల్ నెల నుంచి బంగారం ధరలు తగ్గుతాయని వ్యాపార నిపుణులు ధీమాగా చెబుతున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారు ఏప్రిల్ వరకు ఆగితే మేలని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.78,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.85,020.
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.77,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.84,640.
♦ ముంబైలో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.77,450 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.84,490.
♦ బెంగళూరులో 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.77,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.84,490.
♦ చెన్నైలో 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.77,450 కాగా.. 24 క్యారట్ల బంగారం ధర రూ. 84, 490.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి వెండి ధరలు ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.1,07,000.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.99,500.
♦ చెన్నైలో కిలో వెండి ధ రూ. 1,07,000గా నమోదైంది.