Union Budget 2025 : చిన్నతరహా పరిశ్రమలకు వరాలు.. ఎంఎస్ఎంఈలకు బిగ్ రిలీఫ్.. స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారెంటీ రూ. 20 కోట్లకు పెంపు!
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో స్టార్టప్‌లు, ఎస్‌ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీని రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారెంటీని రూ.20 కోట్లకు పెంచారు.

Union Budget 2025
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో స్టార్టప్‌లు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) కోసం భారీ ప్రకటనలు చేశారు. దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు స్టార్టప్ కంపెనీలకు అందించే రుణాల పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు.
అందులో ప్రధానంగా ఎస్‌ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీని రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారెంటీని రూ.20 కోట్లకు పెంచారు. ఇది కాకుండా, స్టార్టప్ ఇండియా చొరవలో భాగంగా రూ. 10వేల కోట్ల తాజా కార్పస్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
Read Also : Budget 2025 : బడ్జెట్ బిగ్ ఎఫెక్ట్.. ఏం పెరుగుతాయి? ఏం తగ్గుతాయి? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..
స్టార్టప్‌ల ఫండ్‌కు రూ.91 వేల కోట్లు వచ్చాయని, ఇప్పుడు మరో రూ.10 వేల కోట్ల నిధులు రానున్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. బడ్జెట్ 2025 ప్రకారం.. ఎంఎస్ఎంఈ వర్గీకరణ కోసం పెట్టుబడి, టర్నోవర్ పరిమితులు వరుసగా 2.5 రెట్లు పెంచింది.
కొత్త వర్గీకరణ ప్రకారం.. ఇప్పుడు రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే (MSME)లు మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌గా వర్గీకరిస్తారు. అయితే, ఇంతకుముందు పరిమితి రూ. 25 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే ఎంఎస్ఎంఈలను చిన్న పరిశ్రమలుగా పరిగణిస్తారు. గతంలో రూ. 10 కోట్ల వరకు ఉంది. అదనంగా, రూ. 125 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే ఎంఎస్ఎంఈలు మీడియం ఎంటర్‌ప్రైజెస్‌గా గుర్తిస్తారు.
అయితే, అంతకుముందు పరిమితి రూ. 50 కోట్లుగా ఉంది. దాంతో పాటు, టర్నోవర్ నిబంధనలను కూడా పెంచారు. మైక్రో ఎంటర్‌ప్రైజ్ నిర్వచనంలో టర్నోవర్ పరిమితిని రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంచారు. చిన్న పరిశ్రమల్లో టర్నోవర్ పరిమితిని రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచారు. మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లో టర్నోవర్ పరిమితిని రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచారు.
ఎంఎస్ఎంఈలకు బిగ్ రిలీఫ్ :
చిన్న, మధ్య తరహా కంపెనీలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిగ్ రిలీఫ్ ఇచ్చారు. ఆర్థిక మంత్రి తన 8వ బడ్జెట్ ప్రసంగంలో ఎంఎస్ఎంఈ రంగానికి క్రెడిట్ గ్యారెంటీ కవర్ పరిమితిని పెంచుతామని చెప్పారు. మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కోసం (MSME) క్రెడిట్ గ్యారెంటీ రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు రెట్టింపు అవుతుంది. దాంతో వచ్చే 5 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్ల రుణం పెరుగుతుంది.
అలాగే, ఉదయం (Udyam) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న చిన్న వ్యాపారాల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి రూ. 5 లక్షల పరిమితితో కూడిన క్రెడిట్ కార్డ్‌ను ప్రకటించారు. తొలి ఏడాది 10 లక్షల వ్యాపారులకు అందజేస్తామన్నారు. దీంతోపాటు ఎంఎస్‌ఎంఈ పరిధిలోకి వచ్చే కంపెనీల పెట్టుబడి పరిమితిని రెండున్నర రెట్లు, టర్నోవర్ పరిమితిని రెండింతలు పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు.
New Classification Criteria for MSMEs
· Investment limit for MSME classification to be made 2.5 times
· Turnover limits for MSME classification to be doubled#ViksitBharatBudget2025 #Budget2025 #UnionBudget2025 pic.twitter.com/ymPVjGfn3x— Ministry of Finance (@FinMinIndia) February 1, 2025
ఎగుమతుల్లో (MSEME)లలో 45శాతం వాటా :
కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో (SMSES) గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో కోటి మందికి పైగా ఎంఎస్‌ఎంఈలు నమోదయ్యాయని, వాటి ద్వారా 7.5 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దేశ ఎగుమతుల్లో 45 శాతం, తయారీ రంగంలో 36 శాతం వాటా కలిగి ఉన్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు.
Read Also : Budget 2025 : పండుగ చేస్కోండి.. భారీగా తగ్గనున్న స్మార్ట్‌ఫోన్లు, టీవీలు.. చౌకైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!
“దేశంలో ప్రస్తుతం ఒక కోటి కన్నా ఎక్కువ నమోదిత ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తయారీ రంగంలో 36శాతం సహకరిస్తున్నాయి” అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
ఈ ఎంఎస్ఎంఈల నాణ్యమైన ఉత్పత్తుల కారణంగా ఎక్కువ సామర్థ్యం, సాంకేతిక పురోగతి, మెరుగైన మూలధనానికి యాక్సస్ అందించేలా పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. టర్నోవర్ పరిమితి వరుసగా 2.5 రెట్లు, 2 రెట్లు పెరుగుతుంది. వృద్ధి, ఉపాధి కల్పనపై వారికి విశ్వాసాన్ని ఇస్తుందన్నారు.