PropEquity Report : వచ్చే ఐదేళ్లలో ఈ 9 ప్రధాన నగరాల్లో కోటిన్నర ఇళ్లకు భారీ డిమాండ్- ప్రాప్ ఈక్విటీ రిపోర్టులో ఆసక్తికర విషయాలు
సామాన్యులు సైతం సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఆసక్తిగా ఉండటంతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

PropEquity Report : ప్రజలు నగరం బాట పడుతున్నారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ ఈక్విటీ తమ తాజా రిపోర్టును రిలీజ్ చేసింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు నగరాల వైపు చూస్తుండటంతో సిటీలోని ఇళ్లకు భారీగా డిమాండ్ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో దేశంలోని 9 ప్రధాన నగరాల్లో కోటిన్నర ఇళ్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. ప్రస్తుతం కోటి రూపాయల దిగువున ఉన్న ప్రాపర్టీల సప్లయ్ 30శాతం తక్కువగా ఉందని వెల్లడించింది.
కోటి రూపాయల ధరలోపు ప్రాపర్టీల సప్లయ్ లో 30శాతం కొరత..
దేశంలోని పలు నగరాల్లో రియాల్టీ రంగం టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ప్రజల నగరం బాట పడుతుండటంతో అందుకు అనుగుణంగా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులు చేపడుతున్నాయి. దేశంలోని జనాభాలో 8శాతం మంది పెద్ద నగరాల్లోనే ఉండటంతో జనాభాకు అవసరమైన నిర్మాణాల్లో కొరత ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ ఈక్విటీ ప్రకటించింది.
Also Read : అసలు ఇన్‌కం ట్యాక్స్ ఎందుకు? ఎత్తేస్తే మంచిది కదా అనుకునే వారు.. ఈ స్టోరీ తప్పకుండా చదవాల్సిందే..
ముఖ్యంగా కోటి రూపాయల ధరలోపు ఉన్న ప్రాపర్టీ సప్లయ్ లో ఇంకా 30శాతం కొరత ఉందని తెలిపింది. దీంతో రాబోయే రోజుల్లో ఆయా నగరాల్లో పలు సంస్థలు పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
రానున్న ఐదేళ్లలో నగరాల్లో కోటిన్నర ఇళ్లకు డిమాండ్..
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు నగరాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో దేశంలోని పలు నగరాల్లో ఇళ్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. వచ్చే ఐదేళ్లలో 9 నగరాల్లో కోటిన్నర ఇళ్లకు డిమాండ్ ఉందని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. చిన్న చిన్న పట్టణాలతో పాటు టాప్ సిటీస్ కూడా శరవేగంగా విస్తరిస్తుండటంతో ఆయా నగరాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
దీనికి తోడు సామాన్యులు సైతం సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఆసక్తిగా ఉండటంతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పెరిగిన డిమాండ్ కు తగ్గట్లు సప్లయ్ పెంచాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇంకా ప్రాపర్టీల ధరలు తక్కువే..
ఇక ఎన్నో ఏళ్లుగా అఫర్డబుల్ హౌసింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ లో ప్రస్తుతం ప్రాపర్టీ విలువలు పెరుగుతున్నాయి. అయితే, దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ప్రాపర్టీల ధరలు ఇప్పటికీ ఇంకా తక్కువగానే ఉండటం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. అయితే వెస్ట్ జోన్ తో పాటు ఈస్ట్ జోన్ లోని ప్రాపర్టీల విలువలు గణనీయంగా పెరిగాయి.
Also Read : మీ జీతం ఎంత? ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? ఈ టేబుల్లో చూసుకోండి..
ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉన్న ధరతో పోలిస్తే హ్యాండ్ ఓవర్ సమయంలో ఎస్ ఎఫ్టీ ధర వెయ్యి నుంచి 1500 రూపాయలు పెరుగుతోంది. కొన్ని ప్రాజెక్టుల్లో ఈ విలువ మరింత అధికంగా ఉంది.
ఇక గతేడాది దేశవ్యాప్తంగా ప్లాట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి. ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈ రంగంలో చక్కని రిటర్న్స్ వస్తుండటం కూడా రియాల్టీకి ప్లస్ పాయింట్ గా మారింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, ప్రాపర్టీ కొనుగోళ్లు రియల్ ఎస్టేట్ డిమాండ్ ను మరింత పెంచుతున్నాయి.