లాడ్జ్ లో సీక్రెట్ రూంలో సెక్స్ రాకెట్..నిర్వాహకుల అరెస్టు

కరోనా కాలంలో క్యాష్ చేసుకొనేందుకు..పర్యాటకులను ఆకర్షించేందుకు లాడ్జ్ ను వ్యభిచార కేంద్రంగా మార్చివేశారు. ఎవరికీ తెలియకుండా..అనుమానం రాకుండా ఉండేందుకు సీక్రెట్ రూంను ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసులే ఆశ్చర్యపోయిన ఈ ఘటన కోయంబత్తూర్ లో చోటు చేసుకుంది.
మెట్టుపాళియంలోని శరణ్యా లాడ్జ్ లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఆ లాడ్జ్ కు చేరుకున్నారు. అక్కడున్న అన్నీ గదులను పరిశీలించారు. కానీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. వ్యభిచారం నిర్వహస్తున్నారన్న సమాచారం తప్పా అని పోలీసులు ఆలోచించసాగారు.
అయితే..ఓ గదిపై అనుమానం కలిగింది. నిశితంగా పరీశీలించారు. ఓ గోడకు చిన్నపాటి అద్దం ఉంది. రెండూ ఎదురెదురుగా ఉన్నాయి. ఎందుకో అనుమానం కలిగింది. అద్దాన్ని గట్టిగ అటూ..ఇటూ కదిపారు. ఆ అద్దం తెరుచుకుంది. లోపల మరో గది ఉండడం ఆశ్చర్యపోయారు.
సీక్రెట్ రూంలో ఓ మహిళ దాక్కుని ఉంది. బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల మహిళను అక్కడి నుంచి సంరక్షణకు తరలించారు.