Traffic Challan: వర్షంలో విచ్ఛలవిడిగా డ్రైవింగ్.. రూ.62వేల ఫైన్ విధించిన పోలీస్

వర్షం పడుతుందని కూడా జాగ్రత్తపడకుండా పబ్లిక్ రోడ్లపై డేంజర్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి రూ.62వేల వరకూ ఫైన్ విధించారు. ఆదివారం మధ్యాహ్నం వర్షం పడుతున్న సమయంలో డేంజరస్ స్టంట్లు చేస్తూ కనిపించారు. ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఆ సీన్ పై పోలీసులు గట్టి యాక్షనే తీసుకున్నారు.

Traffic Challan: వర్షంలో విచ్ఛలవిడిగా డ్రైవింగ్.. రూ.62వేల ఫైన్ విధించిన పోలీస్

Traffic Challan

Updated On : August 13, 2021 / 6:19 AM IST

Traffic Challan: వర్షం పడుతుందని కూడా జాగ్రత్తపడకుండా పబ్లిక్ రోడ్లపై డేంజర్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి రూ.62వేల వరకూ ఫైన్ విధించారు. ఆదివారం మధ్యాహ్నం వర్షం పడుతున్న సమయంలో డేంజరస్ స్టంట్లు చేస్తూ కనిపించారు. ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఆ సీన్ పై పోలీసులు గట్టి యాక్షనే తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాద్ విజయ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కార్లకు సైరన్ ఉపయోగిస్తూ.. పబ్లిక్ రోడ్లపై జిగ్ జాగ్ వేలో ప్రయాణిస్తున్నారంటూ స్థానికులంతా ఆరోపిస్తున్నారు. ఆ వీడియోలో కార్ కిటికీల్లో నుంచి బయటకు వేలాడుతూ.. ప్రయాణిస్తున్నారు.

దీనిపై ట్రాఫిక్ ఎస్పీ స్పందించారు. వీడియోలో కనిపిస్తున్న నెంబర్ల ఆధారంగా వాహనాన్ని ట్రేస్ చేసి వారిపై తగిన యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. అంతే ఆ వాహనాలపై రూ.62వేల ట్రాఫిక్ చలానా విధించారు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న సూరజ్ పాల్ సింగ్, రాహుల్ నగర్, శేఖర్ కుమార్ అనే ముగ్గుర్ని గుర్తించారు.

ప్రతి కారులో నలుగురు ప్రయాణిస్తున్నట్లు గుర్తించాం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు ఇద్దరికీ చెరొక రూ.5వేల ఫైన్, సౌండ్ పొల్యూషన్ చేస్తున్నందుకు ఇద్దరికీ చెరొక రూ.10వేలు ఫైన్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లేనందుకు రూ.2వేలు ఫైన్, స్టంట్స్ చేసినందుకు ఒకరికి రూ.5వేలు ఫైన్, మరొకరికి రూ.20వేల ఫైన్ విధించారు.

వైరల్ అయిన వీడియోలనే సాక్ష్యంగా చూపిస్తూ.. వారిపై ఫైన్ విధించారు.