Ajit Pawar: బాహుబలిగా శరద్ పవార్.. కట్టప్పగా అజిత్ పవార్.. పోస్టర్లు మామూలుగా లేవు..

ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్ అంటున్న వేళ ఆ పార్టీ స్టూటెండ్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Ajit as backstabber Kattappa

Ajit Pawar – Maharashtra: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌(Sharad Pawar)ను ఆయన సోదరుడి కుమారుడు, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్ వెన్నుపోటు పొడిచారంటూ పోస్టర్లు వెలిశాయి. శరద్‌ పవార్‌ ను బాహుబలిగా, అజిత్‌ పవార్ ను కట్టప్పగా ఈ పోస్టర్లలో చూపారు.

ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గానికి చెందినవారే ఈ పోస్టర్లు ఏర్పాటు చేయించారు. ఎన్సీపీ స్టూడెంట్ వింగ్ ఢిల్లీలోని ఎన్సీపీ కార్యాలయం వద్ద ఈ పోస్టర్లు అంటించింది. శరద్‌ పవార్‌ పై అజిత్‌ పవార్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో అజిత్ పవార్ కలిశారు.

ఈ నేపథ్యంలోనే బాహుబలి-కట్టప్ప ఈ పోస్టర్లు కనపడుతున్నాయి. ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్ అంటున్న వేళ ఆ పార్టీ స్టూటెండ్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఇప్పటికే అజిత్‌ పవార్‌ ను బీజేపీ-శివసేన షిండే ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా నియమించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు జరిగిన సమయంలోనే అజిత్ పవార్ తిరుగుబాటు చేయడం గమనార్హం. అజిత్ పవార్ తీరుపై శరద్ పవార్ వర్గ నేతలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగుతున్నారు.

Bulldozer on BJP Leader House: తిరగబడ్డ బుల్డోజర్.. బీజేపీ ఎమ్మెల్సీ ఇంటిపైకి బుల్డోజర్‭ ప్రయోగించిన బిహార్ ప్రభుత్వం