Pragya Singh Thakur: ఇంట్లో కత్తుల్ని పదును చేసి పెట్టుకోండి, ఎందుకంటే.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
క్రైస్తవ మిషనరీల్లో పిల్లల్ని చదివించొద్దని ప్రగ్యా సూచించారు. అందులో చదవడం వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని ఆమె పేర్కొన్నారు. మిషనరీల్లో చదివిన వారికి సంస్కృతీ సంప్రదాయాలు తెలియవని, వారు తమ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పడేస్తారని అన్నారు. అక్కడ చదువుకుంటే స్వార్థం పెరుగుతుందని, అలాంటి వారు కుటుంబం గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ ఆలోచించరని అన్నారు
Keep knives sharpened at home says Sadhvi Pragya
Pragya Singh Thakur: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే భారతీయ జనతా పార్టీ నేత, భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ మరోసారి తన వ్యాఖ్యలతో దుమారాన్ని లేపారు. ఇంట్లో కత్తుల్ని పదును చేసి పెట్టుకోవాలని, వాటి అవసరం ఎప్పుడైనా రావొచ్చంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో జరిగి హిందూ జాగరణ వేదిక సదస్సుల్లో ఆమె మాట్లాడుతూ ముస్లింలను క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని హిందువులకు ఈ సూచన చేశారు. శివమొగ్గలో ఆ మధ్య హిందూ గ్రూపుకు చెందిన ఒక కార్యకర్త హత్యను ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
WhatsApp Report : వాట్సాప్ డెస్క్టాప్ యూజర్లు త్వరలో స్టేటస్ అప్డేట్స్పై కూడా రిపోర్టు చేయొచ్చు!
ముస్లింలను ఉద్దేశించి సాధ్వి వ్యాఖ్యానిస్తూ ‘‘లవ్ జిహాద్ పేరుతో వారికి జిహాద్ అనే ఒక సంప్రదాయం ఉంది. వాళ్లు ప్రేమ పేరుతో జిహాద్ చేయరు. జిహాద్ పేరుతో ప్రేమిస్తారు. మనం (హిందువులు) కూడా ప్రేమిస్తాం. మనం భగవంతుడిని ప్రేమిస్తాం. ఒక సన్యాసి భగవంతుడిని ప్రేమిస్తారు. దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణచివేతదారులను, పాపాత్ములందరినీ అంతం చేయాలని సన్యాసి చెప్పారు. లేదంటే ఇక్కడ నిజమైన ప్రేమకు నిర్వహనం ఉండదు. అందుకే వారికి సమాధానం చెప్పాలి. లవ్ జిహాద్ పేరుతో మోసపోకుండా మీ అమ్మాయిలను రక్షించండి. వారికి సరైన విలువలు నేర్పండి’’ అని అన్నారు.
Hyderabad Drugs : బాబోయ్.. హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం, ఏకంగా రూ.50 కోట్ల విలువైన డ్రగ్ స్వాధీనం
ఇక స్వీయ రక్షణ కోసం అవసరమైతే కత్తులు వాడుకోవాలని, ఎవరైనా దాడి చేస్తే వారికి తిరిగి కఠువైన జవాబు ఇవ్వడం మన హక్కని ప్రగ్యాసింగ్ అన్నారు. ‘‘మీ ఇంట్లో ఉన్న కత్తుల్ని పదును చేసి పెట్టుకోండి. కనీసం కూరగాయలు కోసుకోవడానికైనా ఉపయోగపడతాయి. ఏమో, ఏం అవసరం వస్తుందో ఎవరికి తెలుసు? తమను తాము రక్షించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఎవరైనా మనపైకి దాడికి ప్రయత్నిస్తే వారికి తిరిగి అదే స్థాయిలో జవాబు ఇవ్వడం కూడా హక్కు కిందే’’ అని ప్రగ్యాసింగ్ అన్నారు.
Vadodara: గుజరాత్ యూనివర్సిటీలో నమాజ్ వివాదం.. కుట్ర దాగుందన్న వీహెచ్పీ
ఇక క్రైస్తవ మిషనరీల్లో పిల్లల్ని చదివించొద్దని ప్రగ్యా సూచించారు. అందులో చదవడం వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని ఆమె పేర్కొన్నారు. మిషనరీల్లో చదివిన వారికి సంస్కృతీ సంప్రదాయాలు తెలియవని, వారు తమ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పడేస్తారని అన్నారు. అక్కడ చదువుకుంటే స్వార్థం పెరుగుతుందని, అలాంటి వారు కుటుంబం గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ ఆలోచించరని అన్నారు. ఇక ఇంట్లో తరుచుగా పూజలు చేయమని ఆమె సూచించారు. ప్రతిరోజు మన ధర్మాన్ని గుర్తు చేసుకోవాలని, శాస్త్రాలు చదవాలని, వాటిని తమ పిల్లలకు రోజూ బోధించాలని పేర్కొన్నారు. ఆ విధంగా చేస్తే పిల్లలు సంస్కృతి నేర్చుకుంటారని ప్రగ్యాసింగ్ ఠాకూర్ అన్నారు.
