ముగిసిన ప్రణబ్ అంత్యక్రియలు

  • Published By: venkaiahnaidu ,Published On : September 1, 2020 / 02:51 PM IST
ముగిసిన ప్రణబ్ అంత్యక్రియలు

Updated On : September 1, 2020 / 3:45 PM IST

Pranab Mukherjee : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు ఢిల్లీలోని లోధి శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో దివంగత నేతకు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించేలా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాభాను అనుమతించారు.



ఢిల్లీ 10 రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసం నుంచి లోధి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగింది.
https://10tv.in/bathukamma-sarees-for-dussehra-festival/
అంతకుముందు ప్రణబ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ఆశ్రునయనల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు.



నెల 10న మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో గత 20 రోజులుగా ప్రణబ్.. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం(ఆగస్టు-31,2020) ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసిన విషయం తెలిసిందే.