Prashant kishor
Prashant kishor : బీహార్ రాజకీయాల్లో తన సత్తా చాటేందుకు రంగంలోకి దిగిన ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. మా పార్టీ అధికారంలోకి వస్తే బీహార్ రాష్ట్రంలో గంటలోపే మద్య నిషేధాన్ని ఎత్తివేస్తానని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్య నిషేధం నిర్ణయం నితీష్ కుమార్ మోసం అని చెప్పారు. మద్య నిషేదం వల్ల ఇంటింటికి అక్రమ మద్యం పంపిణీ పెరిగిందని, రాష్ట్రానికి 20వేల కోట్ల ఎక్సైజ్ సుంకం రాబడి రాకుండా పోయిందని అన్నారు. అక్రమ మద్యం వ్యాపారంతో రాజకీయ నాయకులు, అధికారులు లబ్ధి పొందుతున్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. నేను సమర్ధ రాజకీయాలను నమ్ముతాను. మద్య నిషేధంపై మాట్లాడేందుకు వెనుకాడబోనని అన్నారు.
Also Read : చైనాలో పదేళ్లలోపు అబ్బాయిల మూత్రంకు యమ డిమాండ్..! కారణం తెలిస్తే ఆశ్చర్య పోతారు
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాద్ పై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ ఏకైక గుర్తింపు అతను లాలూప్రసాద్ కొడుకు కావటమే. తేజస్వీకి జీడీపీ, జీడీపీ వృద్ధి రేటుకు మధ్య తేడా కూడా తెలియకపోవడం బీహార్ దౌర్భాగ్యం అన్నారు. తేజస్వీ యాదవ్ రాష్ట్రంలో చేపట్టిన యాత్రపై మాట్లాడుతూ.. కనీసం అతడు ఇప్పటికైనా ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రజల మధ్యకు వెళ్తున్నాడని, అది మంచి పరిణామమే అని అన్నారు. ఎన్డీయేలో చేరినందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పారని ఇటీవల తేజస్వీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వారిద్దరి వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప ప్రయోజనం ఏమీ లేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
ఇదిలాఉంటే.. ఈ ఏడాదిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ నుంచి కనీసం 40మంది ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని ఇటీవలే ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన విషయం తెలిసిందే.