చైనాలో పదేళ్లలోపు అబ్బాయిల మూత్రంకు యమ డిమాండ్..! కారణం తెలిస్తే ఆశ్చర్య పోతారు
చైనా వింత ఆచారాలు ఉంటాయి. చైనీయుల ఆహారం, పానీయల విషయంలో ఇతర దేశాలకంటే చాలా భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా తినని జంతువుల మాంసాలను

Boys under ten years urine
china : చైనాలో వింత ఆచారాలు ఉంటాయి. చైనీయుల ఆహారం, పానీయల విషయంలో ఇతర దేశాలకంటే చాలా భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా తినని జంతువుల మాంసాలను కూడా చైనాలో లొట్టలేసుకొని తింటుంటారు. అయితే, ఆ దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్సీఎంపీ) ప్రకారం.. పదేళ్ల లోపు అబ్బాయిల మూత్రంను సేకరిస్తారు. అందులోనూ నవజాత బాలురకు ఒక నెల వయస్సు వచ్చే ఒకరోజు ముందు, మొదటి ఉదయం మూత్రం అత్యంత విలువైనదిగా భావిస్తారు. ఈ మాత్రాన్ని అనేక విధాలుగా వినిగిస్తారట.
Also Read : Mini Moon Earth : మన భూమికి ‘మినీ చంద్రుడు’ వస్తున్నాడు.. 2 నెలలు మనచుట్టే తిరుగుతాడు!
ఈ ఆచారం వెనుక ఒక ఆశ్చర్యకరమైన సంప్రదాయ నమ్మకం ఉంది. సాంప్రదాయ చైనీస్ సంస్కృతిలో బాలుర మూత్రంలో వివిధ ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని అక్కడి వారు బలంగా నమ్ముతారు. ఈ మూత్రం వినియోగించిన వంటకాలు, ఔషదం ద్వారా మనిషిలో శక్తిని నింపుతుందని, జ్వరాన్ని తగ్గించడంతోపాటు ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని నమ్ముతారు. దుష్ట శక్తులను దూరంగా ఉంచడం, అధృష్టాన్ని పొందండం కూడా వీటిలో ఉన్నాయి. చైనీయుల పురాతన కాలంలో బాలుర మూత్రాన్ని ‘అమర నీరు‘గా ఉపయోగించేవారని చెబుతారు. మింగ్ రాజవంశానికి చెందిన జియాజింగ్ చక్రవర్తి (1368 -1644) తాను సేవించే పానియం తయారీలో పదేళ్లలోపు బాలుర మూత్రాన్ని కలిపేవారట.
Also Read : అంతరిక్షంలోనే బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్న సునీతా విలియమ్స్
బెజియాంగ్ ప్రావిన్స్ లో అబ్బాయిల మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లు, ఫుజియాన్ ప్రావిన్స్ లో అబ్బాయిల మూత్రంతో తయారు చేసిన పంది మాంసం వంటకాలు కూడా ఉన్నాయి. చాలామంది పదేళ్లలోపు అబ్బాయిల మూత్రాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి ఇంట్లో ఉంచుతారట. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా పారద్రోలగలుతుందని అక్కడి వారి నమ్మకం. ఇలాంటి నమ్మకాలను పలు చైనా సినిమాల్లో చూపించారు. 1987లో వచ్చిన మిస్టర్ వాంఫైర్ లో తావోయిస్ట్ పూజారి పాత్రను హాంగ్ కాంగ్ నటుడు పోషించాడు. మంత్రగత్తెని ఓడించడానికి బాలుడి మూత్రాన్ని ఉపయోగించడం చూపించారు.
సాంప్రదాయ చైనీస్ వైద్యంలో చాలాకాలంగా మూత్రాన్ని వినియోగిస్తున్నారు. రెన్ ఝూంగ్ బాయి అనే వంటకం మూత్ర అవక్షేపం నుంచి తయారు చేయబడిన ఒక ప్రసిద్ధ చైనీస్ ఔషదం. దీనిని తీసుకోవడం ద్వారా వేడిని తొలగించడానికి, వాపును తగ్గించడానికి, రక్తస్త్రావం ఆపడానికి ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా ఔషధం యొక్క కషాయాలను తయారు చేయడానికి పదేళ్లలోపు బాలుర మూత్రాన్ని నీటితో కలపడం, ఔషధం తయారు చేసిన తరువాత దానికి జోడించ వల్ల ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. ప్రసవం తరువాత స్త్రీలకు కొన్నిసార్లు ఈ మూత్రాన్ని సూప్ లో ఇస్తారట. ఇలాంటివన్నీ చైనాలోని కొన్ని ప్రాంతాల వారు మాత్రమే నమ్ముతారట.
తూర్పు చైనీస్ నగరం డోంగ్‌యాంగ్‌లో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుఉన్న అబ్బాయిల మూత్రంలో గుడ్లను నానబెట్టి లేదా ఉడికించే పద్దతి స్థానిక సంప్రదాయంగా భావిస్తుంటారు. అందుకే డోంగ్ యాంగ్ ప్రావిన్స్ లోని ప్రాథమిక పాఠశాలల టాయ్ లెట్స్ నుంచి పిల్లల మూత్రాన్ని బకెట్లలో సేకరిస్తారు. ఆ మూత్రంలో గుడ్లను బాగా నానబెట్టి ఉడికించి సర్వ్ చేస్తారు. అవి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని అక్కడి ప్రజల నమ్మకం. అవి తింటే… వేసవిలో హీట్ స్ట్రోక్ ముప్పు తప్పుతుందని, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని అక్కడి వారు చెబుతున్నారు. అందుకే డోంగ్‌యాంగ్ నగర ప్రజలు ఈ వంటకాన్ని ఇష్టంగా తింటారు.