Sunita Williams : ‘మేం పనిచేయకుంటే.. ఎముకల సాంద్రతను కోల్పోతాం..’ అంతరిక్షంలో సవాళ్లపై సునీతా విలియమ్స్ ఇంకా ఏమన్నారంటే?

Sunita Williams : సునీతా విలియమ్స్ తన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ప్రస్తావించారు. అంతరిక్షంలో తన ఆరోగ్యం గురించి ఆందోళనల నేపథ్యంలో ఎముక సాంద్రత నష్టపోయే పరిస్థితి ఎక్కువగా ఉందని తెలిపారు.

Sunita Williams : ‘మేం పనిచేయకుంటే.. ఎముకల సాంద్రతను కోల్పోతాం..’ అంతరిక్షంలో సవాళ్లపై సునీతా విలియమ్స్ ఇంకా ఏమన్నారంటే?

Sunita Williams explains how she’s managing bone loss and radiation in presser from ISS

Updated On : September 15, 2024 / 12:09 AM IST

Sunita Williams : అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ మరోసారి స్పేస్ కాల్‌లో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అంతరిక్షంలో ఉండటం తనకు ఆనందంగా ఉందని సునీత విలియమ్స్ అన్నారు. బోయింగ్ తమను విడిచివెళ్లడం కఠిన వ్యవహారంగా అనిపిస్తోందని, మరికొన్ని నెలలు కక్షలోనే గడపాల్సి ఉందని తెలిపారు. అయినా అంతరిక్షంలో ఉండటం హ్యాపీగా ఉందని వ్యాఖ్యానించారు.

తమ సర్దుబాటు వెంటనే జరగలేదన్న సునీత విలియమ్స్ ఇదంతా విధుల్లో భాగంగానే భావిస్తున్నామని తన కుటుంబ సభ్యులకు కఠినమైన సమయమని, అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారని సునీత తెలిపారు. కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నారని బుచ్ విల్‌మోర్ కూడా వ్యాఖ్యానించారు. అయినా ఇక్కడ ఉండటం ఎలాంటి ఇబ్బందికి గురిచేయడం లేదన్నారు. అంతరిక్షంలో ఇతర పనులను కొనసాగించడానికి ఇంకాస్తా సమయం దొరికిందని సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల కొన్ని నెలల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతరిక్షంలో తన ఆరోగ్యంపై ఆందోళనల నేపథ్యంలో సునీతా విలియమ్స్ తాను ఎలా ఎదుర్కొంటున్నారో అక్కడి పరిస్థితి గురించి ప్రస్తావించారు. ఎముకుల సాంద్రతను నష్టపోయే పరిస్థితి ఎక్కువగా ఉందని తెలిపారు. అంతరిక్షంలో ఎక్కువ సమయం వల్ల కలిగే ప్రభావాల నుంచి తమను తాము రక్షించుకునేందుకు విలియమ్స్, తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ కఠినమైన రోజువారీ వ్యాయామాలను కొనసాగిస్తున్నట్టు వివరించారు.

అందుకే వ్యాయామాలు చేస్తుంటాం :
“మేము ప్రతిరోజూ పని చేయకపోతే.. ఎముక సాంద్రతను కోల్పోయే ప్రమాదం ఉంది” అని సునీత తెలిపారు. వీరిద్దరి సాధారణ రోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. విల్మోర్ ఉదయం 4:30 గంటలకు నిద్ర లేస్తారు. వీరిద్దరూ కార్డియోవాస్కులర్ వ్యాయామాలు, ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడం, డెడ్‌లిఫ్ట్‌లు, స్క్వాట్‌లను మెషిన్‌లతో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలను చేస్తారు. భౌతిక సవాళ్లు ముఖ్యమైనవి అయినప్పటికీ, గురుత్వాకర్షణ లేకపోవడం అనేక ప్రయోజనాలను కలిగి ఉందని విలియమ్స్ పేర్కొన్నారు. “అంతరిక్షంలో కీళ్ల నొప్పులు లేవు. ఎందుకంటే ఏ జాయింట్‌పై ఒత్తిడి ఉండదు. ఇది చాలా సులభంగా ఉంటుంది” అని విల్మోర్ పేర్కొన్నారు.

మైక్రోగ్రావిటీతో శారీరక సమస్యలు, రేడియేషన్ ఎఫెక్ట్ :
భౌతిక వ్యాయామాలతో పాటు, వ్యోమగాములు తప్పనిసరిగా రేడియేషన్ ఎక్స్పోజర్, మైక్రోగ్రావిటీ ప్రభావాలు వంటి అంతరిక్షం ప్రత్యేకమైన పర్యావరణ సవాళ్లతో పోరాడాలి. ఐఎస్ఎస్ భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో ఉంటుంది. ఇక్కడ వ్యోమగాములు గణనీయంగా ఎక్కువ స్థాయి రేడియేషన్‌కు గురవుతారు.

ఒక ఏడాది పాటు భూమిపై వారు అనుభవించే దానికి సమానంగా ఉంటుంది. విలియమ్స్, విల్మోర్ ఈ పరిస్థితులకు తగినట్టుగా ఉన్నారు. మైక్రోగ్రావిటీ శారీరక ప్రభావాలతో సహా, శరీరంలో అనేక మార్పులకు కారణమవుతుంది. దీని ఫలితంగా వ్యోమగాములలో తరచుగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఒంటరిగా ఉండటం వల్ల కలిగే మానసిక క్షోభ కూడా గణనీయంగానే ఉంటుంది. అయితే, విలియమ్స్,విల్మోర్ తమ లక్ష్యంపై దృష్టి సారిస్తూనే ఉన్నారు.

అంతరిక్షంలో సవాళ్లను అధిగమిస్తాం.. :
ఇద్దరు వ్యోమగాములు ఇంటికి దూరంగా ఉండటం వల్ల మానసిక, భావోద్వేగ సవాళ్లను ఎదుర్కొన్నట్టుగా తెలిపారు. కానీ, అలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడంలో తాము ట్రైనింగ్ తీసుకున్నామని వివరించారు. “మేం ఇంటికి ఎప్పుడు తిరిగి వెళ్తామనే బెంగ లేదు. మేము ఐఎస్ఎస్‌లో ప్రతిరోజూ చేయగలిగినంత పనులను పూర్తిచేస్తాం” అని విల్మోర్ చెప్పారు. అంతరిక్షంలో ఉన్న సమయంలో తన విధానం ఎలా మారిపోయిందో కూడా విలియమ్స్ షేర్ చేశారు. ఐఎస్ఎస్‌లో జీవితం గురించి ప్రస్తావిస్తూ.. “ఇది మనకు ఉన్న ఒకే గ్రహం. మనం ఇక్కడ కలిసి ఉన్నందుకు మనమందరం నిజంగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అదే మా ప్రదేశం” అన్నారు.

తమ కుటుంబాలకు దూరమైనప్పటికీ, వ్యోమగాములు ఇద్దరూ అంతరిక్షంలో సుదీర్ఘ కాలం ఉండాల్సిరావడంపై సానుకూలంగా స్పందించారు. తాము భూమికి తిరిగి రావడానికి ఆలస్యమైన సాంకేతిక వైఫల్యాల వంటి అనూహ్య పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే శిక్షణ పొందామని పేర్కొన్నారు. అంతరిక్ష నౌక, స్టార్‌లైనర్, సాంకేతిక సమస్యలు తలెత్తిన తర్వాత అది వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది. వీరిద్దరూ వచ్చే ఏడాది స్పేస్‌ఎక్స్ విమానంలో తిరిగి రావాల్సి ఉంది.

అంతరిక్షం నుంచే ఓటు వేస్తాం : సునీతా విలయమ్స్
మరోవైపు, త్వరలో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే తాము ఓటు వేస్తామని సునీత విలియమ్స్ స్పష్టం చేశారు. దేశ పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. అంతరిక్షం నుంచి ఓటు వేసే క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇప్పటికే, తమకు ఓటు వేసేందుకు తన బ్యాలెట్ రిక్వెస్ట్ కూడా పంపినట్లు విలయమ్సన్ వెల్లడించారు.

Read Also : అంతరిక్షంలోనే బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోనున్న సునీతా విలియమ్స్‌