Prashant kishor on Nitish kumar: మరోసారి సీఎం నితీశ్‌ను టార్గెట్ చేసిన పీకే
నితీశ్ జంపింగ్ జలానీపై పీకే ఆసక్తిగా స్పందించారు. తరుచూ క్యాంపులు మారే అవకాశం ఉన్న నితీశ్.. మరోసారి క్యాంపు మారుస్తారని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని తేల్చి చెప్పారు. బిహార్ ప్రజలందరికీ ఈ విషయం తెలుసని, నితీశ్ క్యాంపు మార్చరనే గ్యారెంటీ రాష్ట్రంలో ఎవరూ ఇవ్వరని పీకే కుండబద్దలు కొట్టారు.

Prashant kishor
Prashant kishor on Nitish kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. బిహార్‌లో తేజశ్వీతో నితీశ్ పొత్తు రాష్ట్రం దాటి ప్రభావం చూపించదని, ఈ పొత్తు వచ్చే ఎన్నికల నాటికి కూడా ఉండబోదని తాను భావిస్తున్నట్లు శనివారం పేర్కొన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీశ్-తేజశ్వీ కలయికపై ప్రశ్నించగా పై విధంగా సమాధానం చెప్పారు.
”ఇది ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశం, దాని ప్రభావం బిహార్‌కే పరిమితమవుతుంది. జాతీయ రాజకీయాలపై ఉంటుందని అనుకోను. నాకున్న రాజకీయ అవగాహన ప్రకారం ప్రస్తుతం ఉన్న ఫార్మేషన్ (జేడీయూ-ఆర్జేడీ కాంబినేషన్)లో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు ఉండవు. బీజేపీ ఒక వైపు, మహా ఘట్ బంధన్‌కు చెందిన 7 పార్టీలు ఒకవైపు ఉండి ఎన్నికలకు వెళ్తాయని నేను అనుకోవడం లేదు” అని పీకే అన్నారు.
ఇక నితీశ్ జంపింగ్ జలానీపై పీకే ఆసక్తిగా స్పందించారు. తరుచూ క్యాంపులు మారే అవకాశం ఉన్న నితీశ్.. మరోసారి క్యాంపు మారుస్తారని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని తేల్చి చెప్పారు. బిహార్ ప్రజలందరికీ ఈ విషయం తెలుసని, నితీశ్ క్యాంపు మార్చరనే గ్యారెంటీ రాష్ట్రంలో ఎవరూ ఇవ్వరని పీకే కుండబద్దలు కొట్టారు.
కాగా, బీజేపీతో తెగతెంపుల అనంతరం ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్ కుమార్. అనంతరమే నితీశ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారనే ప్రచారం ప్రారంభమైంది. అయితే అప్పట్లో కూడా పీకే ఇదే విషయం చెప్పారు. ఆ రెండు పార్టీల పొత్తు కేవలం బిహార్ రాష్ట్రం వరకు మాత్రమేనని, రాష్ట్రం దాటి ఏమాత్రం ప్రభావం చూపదని పీకే అన్నారు.
Mayawati: బీజేపీకి ఎస్పీకి లోపాయికారి ఒప్పందం.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీఎస్పీ చీఫ్