బైబై బాబు : టీడీపీకి లింక్ చేస్తూ పీకే ట్వీట్

  • Publish Date - April 11, 2019 / 11:22 AM IST

ఏపీ ప్రజలు ఇప్పటికే తీర్పును నిర్ణయించుకున్నారని..బై..బై..బాబు అంటూ వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. అయితే..తన పేరిట ఓ నకిలీ ట్వీట్ ఇమేజ్‌ను టీడీపీ ప్రచారం చేస్తోందంటూ ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఓటమి కళ్లెదుట ఉన్నప్పుడు..ప్రజల్లో విశ్వాసం కోల్పోయినప్పుడు ఇలాంటి చర్యలకు దిగుతారన్నారు. ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరని తెలిపారు పీకే.