కాదు, లేదంటూనే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టేస్తున్నారా? 

  • Published By: veegamteam ,Published On : February 19, 2020 / 09:37 AM IST
కాదు, లేదంటూనే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టేస్తున్నారా? 

Updated On : February 19, 2020 / 9:37 AM IST

మంగళవారం పాట్నాలో ప్రశాంత్ కిషోర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హాలంతా కిక్కిరిసిపోయింది. జనతాదళ్ నుంచి వెళ్లగొట్టబడిన తర్వాత మీడియా మాట్లాడటం అదే . అప్పుడే తానేమీ కొత్త పార్టీ పెట్టబోవడంలేదని అన్నారు. అదీ చాలా క్లియర్ గా చెప్పారు. ఎన్నికల వ్యూహకర్తగా అమిత్ షాకన్నా, ప్రశాంత్ కిషోర్ కే ఎక్కువ సక్సెస్ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి పీఠమెక్కడానికి వెనుకనుంచి సాయం చేశారు. మమతాబెనర్జీ మరోసారి గెలవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నారు. స్టాలిన్ ను అందలమెక్కించడానికి ఇప్పటికే వ్యూహాన్ని తీర్చిదిద్దారు. ఆయన చాలా బీజీ. ఆయన సేవల కోసం చాలాపార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పాలిటిక్స్ లో ఇప్పటిదాకా అమిత్ షాకున్న స్టార్ స్టేటస్ నుకొట్టేశారు. ఈ సమయంలో పార్టీ పెడతారా? 

“నాకు బీహార్ అభివృద్ధికావాలి. నేను ఎక్కడికీ వెళ్లడంలేదు. ఇక్కడే ఉంటా. నాలాంటి వాళ్లతో పనిచేస్తా. ఎవరినో ఎన్నికల్లో గెలిపించడానికి ఇక్కడ నేను లేను”

అంతలోనే కొత్త ప్లాన్ బైటకు తీశారు. ‘Baat Bihar Ki’ పేరుతో ఆయన కుర్రాళ్లను కలవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకున్నారు. రెండు లక్షలమంది కుర్రాళ్లను ఇప్పటికే వాలంటీర్లగా సిద్ధం చేశారంట. ఇందులో చాలామంది నితీష్ కుమార్ పార్టీకి చెందిన కార్యకర్తలూ ఉన్నారు. 100రోజుల్లో పదిలక్షలమందిని చేర్చుకోవాలన్నది మా అభిమితన్నారు కిషోర్. ఇదంతా బీహార్ రాజకీయాలను మర్చాడానికేనని ప్రకటించారు. అలాగని నేనేమీ కొత్త పార్టీ పెట్టబోవడంలేదనీ అన్నారు. 

“నిజానికి, నితీష్ కుమార్ కానీయండి, సుశీల్ కుమార్ మోడీ కానీయండి, ఎవరైనా నా ప్రయత్నానికి మద్దతిస్తే స్వాగతిస్తాను.” అనికూడా ప్రశాంత అన్నారు. మరి బీహార్ లో ఎదుగుతున్న సిపిఐ లీడర్ కన్నయ్యకుమార్ సంగతేంటి? “నేను ఇంతకుముందే కన్నయ్యను కలిశాను. అతనికీ బీహార్ వృద్ధిచెందాలనే ఉంది. మంచిది. దానికి నేనువ్యతిరేకంకాదు. నేను అతనితో కలసిపనిచేస్తానా? లేదా? అన్నది సమస్యకానేకాదు.” అని కిషోర్ కుమార్ తన అభిప్రాయాన్ని చెప్పారు. 

రాజకీయ వ్యూహకర్తగా 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని కొత్తదారిని పట్టించడానికి ముందు, యునైటెడ్ నేషన్స్ లో హెల్త్ ఎక్స్ పర్ట్ గా పనిచేశారు. నరేంద్రమోడీ అద్భుత విజయంలో తనవాటాను  క్లైమ్ చేసుకున్నారు. స్టార్ అయిపోయారు. అక్కడ నుంచి తాను మెచ్చిన నేతలను పీఠాలను ఎక్కించడమే ఆయన వృత్తిగా మారింది. అయన విజయాలను చూస్తే ముచ్చటేస్తుంది. 2015లో మహాఘట్ బంధన్ తో మోడీకి బీహార్ లో అడ్డుకట్టవేశారు. 2017లో కెప్టెన్ అమరీందర్, 2019లో వైఎస్ జగన్ ను అధికారంలో తీసుకొనివచ్చారు. ఈ ఘనతలో కొంత ఆయన ఖాతాలోనే పడింది. అదేసమయంలో యుపీలో ఆయన హస్తాన్ని నిలబెడతామనుకున్నా, బీజేపీ దిగ్విజయయాత్రలో చితికిపోయింది.

Read More>>పబ్‌కెళ్లిన ప్రీతి ఏమైంది – థ్రిల్ కలిగిస్తున్న ‘హిట్’ ట్రైలర్