Ram Navami : రాముడి ఆదర్శాలను పాటిద్దాం.. రాష్ట్రపతి

బుధవారం శ్రీరామ నవమి సందర్బంగా ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్​ కోవింద్​ శుభాకాంక్షలు చెప్పారు.

Ram Navami : రాముడి ఆదర్శాలను పాటిద్దాం.. రాష్ట్రపతి

Ram Navami

Updated On : April 20, 2021 / 11:04 PM IST

President బుధవారం శ్రీరామ నవమి సందర్బంగా ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్​ కోవింద్​ శుభాకాంక్షలు చెప్పారు. రాముడు జన్మించిన రోజును శ్రీరామ నవమిగా ప్రజలు జరుపుకుంటారని కోవింద్ అన్నారు. శ్రీరాముడి ఆదర్శాలను తమ జీవితాల్లోనూ పాటించేలా ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను రాష్ట్రపతి కోరారు. తద్వారా అద్భుతమైన భారత్​ను నిర్మించే దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటనను.. రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది.

రాముడు జన్మించిన రోజును శ్రీరామ నవమిగా ప్రజలు జరుపుకుంటారు. న్యాయం, గౌరవం కోసం పోరాడే మనం.. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి బోధనలను అనుసరించాలి. సద్గుణాలతో ఎలా జీవించాలో రాముడు మనకు బోధించాడు. రాముడి జీవితం, ఆయన అనుసరించిన ధర్మం, నిజాయతీ మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున ఆయన ఆదర్శాలను పాటించేలా మనం ప్రతిజ్ఞ చేద్దామని రాష్ట్రపతి పేర్కొన్నారు.