BRICKS -2026: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మోడీ అపూర్వ కానుక.. అసలు ఏంటా పుస్తకం.. అంధులు ఏముందో తెలుసా?
18వ బ్రిక్స్(BRICKS -2026) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ వ్లాదిమిర్ పుతిన్‌కు 'తిరుక్కురళ్' పుస్తకాన్ని బహూకరించారు.
- V Santhosh Kumar
- Published on- September 11, 2026 / 04:58 PM IST
Prime Minister Modi presented 'Thirukkural' Book to Vladimir Putin at 18th BRICS 2026 summit.
- పుతిన్‌కు మోడీ ఆత్మీయ స్వాగతం
- వాణిజ్యం రక్షణపై కీలక చర్చలు
- ఢిల్లీలో BRICS శిఖరాగ్ర సదస్సు
BRICKS -2026: భారత్ వేదికగా ప్రారంభమైన 18వ బ్రిక్స్(BRICKS -2026) శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక, భౌగోళిక రాజకీయ సవాళ్లు ఎదురవుతున్న సమయంలో న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ సదస్సు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యానికి అత్యంత కీలక వేదికగా మారింది. ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ భారత్ మండపంలో ఘన స్వాగతం పలికి, తమిళ మహాకావ్యం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని బహూకరించి ఇరు దేశాల ప్రాచీన సాంస్కృతిక సంబంధాలను చాటిచెప్తుంది. త్రివర్గాల సిద్ధాంత ఆధారంగా రూపొందిన ఈ ప్రాచీన గ్రంథం మానవ జీవితంలో నైతిక విలువలు, వ్యక్తిగత ధర్మం (అరమ్), రాజ్య పాలన-ఆర్థిక వ్యవస్థ (పొరుళ్), ప్రేమ-జీవిత అనురాగాలు (ఇన్బమ్) అనే మూడు ప్రధాన విభాగాలలోని 1,330 పద్యాల ద్వారా సార్వజనీన జీవన సూత్రాలను అందిస్తుంది.
రూ.100 బిలియన్ డాలర్ల వాణిజ్యం.. రక్షణ రంగానికి ఊతం:
మోదీ-పుతిన్ ద్వైపాక్షిక భేటీలో ముఖ్యంగా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చమురు, ఎరువులు, అణుశక్తి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంతో పాటు, రష్యాకు చెందిన SU-57 ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై కీలక చర్చలు జరిగాయి. అలాగే రష్యాలో భారత పెట్టుబడులు, నైపుణ్యం కలిగిన భారతీయులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మౌలిక వసతుల కల్పనపై ఇరు నేతలు ప్రత్యేక శ్రద్ధ వహించారు.
ఉక్రెయిన్ సంక్షోభం.. జిన్‌పింగ్‌తో కీలక భేటీ:
ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా పరిణామాలపై చర్చించిన ప్రధాని మోదీ, దౌత్యం ద్వారానే శాంతి సాధ్యమని స్పష్టం చేశారు. ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తోనూ కీలక చర్చలు జరపనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రకటించబోయే ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ ప్రపంచ ఆర్థిక, రాజకీయ మార్పులలో భారత్ దౌత్యపరమైన ఆధిపత్యాన్ని, గ్లోబల్ సౌత్ నాయకత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పనుంది.
