మోడీ భారత పౌరుడేనా RTIలో దరఖాస్తు

  • Publish Date - January 18, 2020 / 02:13 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత పౌరుడేనా ఈ సందేహం ఓ వ్యక్తికి వచ్చింది. వెంటనే RTIలో దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం తనకు ఇవ్వాలని కోరారు. ఎందుకంటే..కొన్ని రోజులుగా పౌరసత్వం చట్టంపై ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం CAAపై తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు పెల్లుబికుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా యూపీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు మరణించారు. 

ఈ క్రమంలో తిస్సూర్ జిల్లాలోని చలాకుడి పట్టణంలోని జోష్ RTI చట్టం కింద..జనవరి 13వ తేదీన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి దరఖాస్తు సమర్పించారు. మోడీ పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలను కోరారు. ముస్లింలను మినహాయించినందుకు తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన..ఉత్తర్ ప్రదేశ్, కర్నాటక, అస్సాంలోలలో గత నెలలో జరిగిన నిరసనల్లో 26 మంది మృతి చెందారు.

దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖైలంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్స్ పెద్ద ఎత్తున్న వినపడుతున్నాయి. 
అయితే..దీనిపై బీజేపీ వెనకడుగు వేయడం లేదు. ప్రతిపక్ష పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచకపడుతున్నారు. ఇటీవలే కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని, ఈ చట్టం ద్వారా పౌరసత్వాన్ని రద్దు చేయదని వెల్లడించారు. రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయంలో దీనిపై మాట్లాడారు. గత కాంగ్రెస్ నేతృత్వంలో NRCని ముందుకు తీసుకొచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా RTIలో దాఖలైన దరఖాస్తుపై ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి. 

Read More : మూడేళ్ల బాలుడి ప్రార్థనకు నెటిజన్ల ఫిదా