పారికర్ భౌతికకాయానికి ప్రధాని నివాళులు

  • Published By: venkaiahnaidu ,Published On : March 18, 2019 / 09:29 AM IST
పారికర్ భౌతికకాయానికి ప్రధాని నివాళులు

గోవా రాజధాని పనాజీలో సీఎం మనోహర్ పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ,రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామణ్. గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం పారికర్ కుటుంబసభ్యులను పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
క్లోమ గ్రంథి క్యాన్సర్ తో కొంతకాలంగా భాధపడుతున్న పారికర్ ఆదివారం(మార్చి-17,2019)తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని పలువురు నేతలు,ప్రముఖులు పారికర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. పారికర్ మృతి కారణంగా సోమవారం జాతీయ సంతాపదినంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 

ఇవాళ(మార్చి-18,2019)సాయంత్రం 5 గంటలకు పనాజీకి 4కిలోమీటర్ల దూరంలోని కంపాల్ లోని SAG గ్రౌండ్స్ లో పారికర్ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.