పార్లమెంట్‌కు నామినేషన్ వేసిన స్టార్ హీరో సోదరి

ముంబై నార్త్ సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి, ప్రముఖ బాలీవుడ్ హీరో సంజయ్దత్ సోదరి ప్రియాదత్ ఇవాళ(8 ఏప్రిల్ 2019) నామినేషన్ దాఖలు చేశారు. తన సోదరుడు సంజయ్ దత్‌తో పాటు వచ్చిన ఆమె పార్లమెంటు అభ్యర్ధిగా నామినేషన్ వేశారు.
2019 ఎన్నికల్లో పోటీ చేయనంటూ రెండు నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన ప్రియా దత్ తర్వాత రాహుల్ గాంధీనికలిసి పోటీకి సుముఖత వ్యక్తం చేసింది.
తన పిల్లల ఆలనాపాలనా చూసుకోవడానికి సమయం దొరకడం లేదు గనుక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు ప్రకటించుకున్న ప్రియాదత్ రాహుల్ సూచనల మేరకు మనసు మార్చుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రియా దత్‌కు ముంబై నార్త్ సీటును కేటాయించింది.
ముంబాయి నార్త్ సెంట్రల్ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రియా దత్.. ఇదే సీటు నుంచి 2005, 2009 ఎన్నికల్లో గెలుపొందింది. అయితే 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాదత్ బీజేపీ అభ్యర్థి పూనమ్ మహాజన్ చేతిలో 1.86 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పొందారు. ప్రస్తుతం ఆమె ఏఐసీసీ సభ్యురాలుగా ఉంది.