Pro-Khalistani posters: కొన్ని రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న వేళ ఢిల్లీలో ఖలిస్థాన్ పోస్టర్ల కలకలం
దేశం కొన్ని రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న వేళ ఢిల్లీలో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు కలకలం రేపాయి. అలాగే, ఖలిస్థాన్ జిందాబాద్, దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన నినాదాలతో గుర్తు తెలియని వ్యక్తులు గ్రాఫిటీ వేశారు. దాదాపు 10 చోట్ల ఇవి కనపడ్డాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ... ఇది భద్రతాపరమైన సమస్య కాదని చెప్పారు.

Pro-Khalistani posters
Pro-Khalistani posters: దేశం కొన్ని రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న వేళ ఢిల్లీలో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు కలకలం రేపాయి. అలాగే, ఖలిస్థాన్ జిందాబాద్, దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన నినాదాలతో గుర్తు తెలియని వ్యక్తులు గ్రాఫిటీ వేశారు. దాదాపు 10 చోట్ల ఇవి కనపడ్డాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ… ఇది భద్రతాపరమైన సమస్య కాదని చెప్పారు.
దుందుడుకు చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. జనవరి 26 సందర్భంగా ఢిల్లీ పోలీసులు అన్ని రకాలుగా భద్రతా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రతి యూనిట్ పనిచేస్తోందని తెలిపారు. నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఖలిస్థాన్ అనుకూల చర్యలకు పాల్పడిందని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
‘సిఖ్స్ ఫర్ జస్టిస్’కు సాయం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. వార్తల్లో నిలవడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని తెలిపారు. గతంలోనూ పలు రాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. నిందితులను పోలీసులు గుర్తించి చర్యలు తీసుకున్నారు.
Viral Video: తుపాకులు పట్టుకుని దోపిడీకి వచ్చిన వారితో పోరాడి తరిమేసిన మహిళా కానిస్టేబుళ్లు