PSLV-C56 Rocket Success : పీఎస్ఎల్వీ – సీ56 రాకెట్ ప్రయోగం విజయవంతం.. సింగపూర్ కు చెందిన 7 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఇస్రో

సింగపూర్ డీఎస్-ఎస్ఏఆర్ తోపాటు ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు. 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

PSLV-C56 Rocket Success : పీఎస్ఎల్వీ – సీ56 రాకెట్ ప్రయోగం విజయవంతం.. సింగపూర్ కు చెందిన 7 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఇస్రో

PSLV-C56 Rocket

SHAR Space Station – ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) పీఎస్ఎల్వీ – సీ56 రాకెట్ ను ప్రయోగం విజయంతం అయింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ – సీ56 రాకెట్ ను ప్రయోగించింది. మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ – సీ56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సింగపూర్ కు చెందిన ఉపగ్రహాలను ఇస్రో విజయంతంగా కక్ష్యలోకి పంపింది. షార్ అంతరిక్ష కేంద్రంలోని

Himachal Tourists : పర్యాటకులకు శుభవార్త…హిమాచల్ హోటల్ అసోసియేషన్ 50 శాతం డిస్కౌంట్

సింగపూర్ డీఎస్-ఎస్ఏఆర్ తోపాటు ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది సింగపూర్ కోసం చేపట్టిన పూర్తి కమర్షియల్ ప్రయోగం. మొత్తం నాలుగు దశల్లో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించారు.

పీఎస్ఎల్వీ సీరిస్ లో ఇది 58వ ప్రయోగం. పీఎస్ఎల్వీ-సీ56 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. సెప్టెంబర్ లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అది కూడా పూర్తిగా కమర్షియల్ ప్రయోగమని వెల్లడించారు.