తీవ్రమైన శ్వాసకోశ బాధలతో ఇబ్బంది పడుతున్న COVID-19 రోగులకు చికిత్స చేయడానికి “పరిమితం చేయబడిన అత్యవసర ఉపయోగం” కోసం చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేయడానికి ఉపయోగించే మెడిసిన్ ఇటోలిజుమాబ్‌ను ఇచ్చేందుకు ఆమోదించింది భారత డ్రగ్ రెగ్యులేటరీ.
COVID-19 చికిత్సకు అపరిమితమైన వైద్య అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటోలీజుమ్యాబ్ ఇప్పటికే చాలా ఏళ్లుగా సోరియాసిస్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మెడిసిన్ వినియోగానికి ముందు ప్రతి రోగి లిఖితపూర్వక సమ్మతి అవసరం ఉంది. ఇటోలీజుమ్యాబ్ మందును భారత్‌కు చెందిన బయోకాన్ సంస్థ తయారు చేస్తోంది. ఈ మందు ఒక్క డోసు ధర రూ.60 వేలు.