పుల్వామా ఎటాక్ : ఆనంద్ మహేంద్రా పోస్ట్ వైరల్

జమ్ము కశ్మీర్ పుల్వామాలో మానవబాంబు దాడి ఘటనపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 16, 2019 / 10:24 AM IST
పుల్వామా ఎటాక్ : ఆనంద్ మహేంద్రా పోస్ట్ వైరల్

Updated On : February 16, 2019 / 10:24 AM IST

జమ్ము కశ్మీర్ పుల్వామాలో మానవబాంబు దాడి ఘటనపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.

జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో మానవబాంబు దాడి ఘటనపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. పాక్ ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పాలనే డిమాండ్ వెల్లువెత్తుతున్న క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 

ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలి? ప్రతీకారం తీర్చుకోవాలి? సర్జికల్ దాడులు కాదు, పాక్‌తో యుద్ధమే చేయాలి? అంటూ పుల్వామా ఉగ్రదాడిపై సామాజిక మాధ్యమాల్లో తెగ పోస్టులు చేస్తున్నారు. ఈ పోస్టు లపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తు..‘కేంద్ర ప్రభుత్వం, సాయుధ దళాలు ఎలా స్పందించాలో సోషల్ మీడియాలోని అర్మ్‌చైర్ యోధులు (వీళ్లు యుద్ధంలో ఎప్పుడూ పాల్గొని ఉండరు. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇంట్లో కూర్చొని యుద్దం చేయాలి అంటూ పోస్ట్‌లు పెడుతుంటారు) ఎన్నో సూచనలు చేస్తున్నారు. కానీ ఒక్క తప్పనిసరిగా గమనించాలన్నారు. జరిగిన పరిణామాలు, తాజా పరిస్థితులను అంచనా వేసుకొని, అందుబాటులోని సమాచారాన్ని విశ్లేషించుకుని..పాక్ ఉగ్రవాదానికి తిప్పుకోని విధంగా ధీటుగా బదులివ్వడానికి ఇండియన్ ఆర్మీకి కొంత సమయం అవసరం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆనంద్ మహేంద్రా మనసులోని మాటలను, అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి నెటిజన్లు చేస్తున్న పోస్టులకు ఆయన ఆసక్తికరంగా స్పందించిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘ఫేస్‌బుక్‌లో మీ ధైర్యం చూసి.. ఆర్మీ వాళ్లు మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారట..’ అంటూ ఓ వ్యక్తితో అతడి భార్య చెబుతుండగా.. అతడు టేబుల్ కింద తలదాచుకున్న కార్టూన్‌ ఉంది. దీనిపై సోషల్ మీడియాలో పలు ఆసక్తికర కామెంట్లు వస్తున్నాయి.

ఇదొక్కటేకాదు ఇలాంటి కార్టూన్లు చాలానే నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  అంతేమరి ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు..చేసే పనులు ఎప్పుడూ సత్ఫలితాలను ఇవ్వవు..ఆలోచించి..విశ్లేషించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయని..ఆనంద్ మహేంద్ర అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. గతంలో కూడా చిన్నారులపై అత్యాచార ఘటన సందర్భంగా కూడా ఆనంద్ మహేంద్రా స్పందిస్తు..‘రేపిస్టులను ఉరి తీసేందుకు ‘తలారి’నవుతానంటు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
 

Read Also :  ప్రధానిపై నమ్మకం లేదు : అమర జవాన్ భార్య తీవ్ర విమర్శలు
Read Also :  ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా