Pune Court: మూడేళ్ళ చిన్నారిపై హత్యాచారం.. 65 ఏళ్ల కామాంధుడికి ఉరిశిక్ష.. పుణె కోర్టు సంచలనం
మహారాష్ట్రలోని పుణె(Pune Court)లో మూడేళ్ల బాలికపై జరిగిన దారుణ హత్యాచారం కేసులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
Pune Court sentences death to 65 year old man involved in three year old girl rape case
- చిన్నారిపై దారుణ హత్యాచారం.
- వృద్ధుడికి మరణ శిక్ష.
- పుణె కోర్టు సంచలన తీర్పు.
Pune Court: మహారాష్ట్రలోని పుణెలో మూడేళ్ల బాలికపై జరిగిన దారుణ హత్యాచారం కేసులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ అమానుషానికి ఒడిగట్టిన 65 ఏళ్ల వృద్ధుడు భీమ్రావ్ను దోషిగా నిర్ధారిస్తూ న్యాయస్థానం అతడికి మరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘోర కలిని ‘అత్యంత అరుదైన కేసు’గా పరిగణించిన జడ్జి(Pune Court), నిందితుడిపై ఎలాంటి కరుణ చూపించలేమని, శిక్షను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
IND vs IRE: టీమిండియాకు ఘోర పరాభవం.. టీ20 సిరీస్ 0-2తో ఐర్లాండ్ కైవసం.. ఒకే ఒక పరుగు తేడాతో..
ఈ దారుణ ఘటన 2026 మే 1న నస్రాపూర్ గ్రామంలో వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన దూడను చూపిస్తానని నమ్మించి, సదరు వృద్ధుడు చిన్నారిని నిర్మానుష్య ప్రాంతంలోని పశువుల షెడ్డులోకి తీసుకెళ్లాడు. అక్కడ పాపపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం, బండరాయితో తలపై బాది అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బాలిక కనిపించకపోవడంతో గాలించిన కుటుంబ సభ్యులకు షెడ్డులో రక్తపు మడుగులో ఉన్న శవం లభించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్వయంగా పర్యవేక్షించారు. పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను ఆధారంగా చేసుకుని నిందితుడు భీమ్రావ్ను క్షణాల మీద అరెస్ట్ చేశారు. వేగంగా విచారణ పూర్తి చేసిన పుణె ప్రత్యేక కోర్టు, నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేకూర్చింది.
