Karnataka HIV Students : కర్ణాటకలో 7వేలకుపైగా కాలేజీ విద్యార్థులకు HIV.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
Karnataka HIV Students : రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం ప్రత్యేక ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో హెచ్ఐవి పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో ఈ శిబిరాలను తప్పనిసరి చేయనున్నారు.
Karnataka HIV Students
- 7,000+ స్టూడెంట్స్కు హెచ్ఐవీ.. ఇక అన్ని కాలేజీల్లో తప్పనిసరి క్యాంపులు
- విద్యార్థుల్లో పెరుగుతున్న హెచ్ఐవీ కేసులు, ప్రభుత్వం ఎమర్జెన్సీ చర్యలు
- హెచ్ఐవి కేసులతో దేశంలో మూడో స్థానంలో కర్ణాటక
Karnataka HIV Students : యువతలో హెచ్ఐవి వ్యాప్తిని ముందుగానే గుర్తించి నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో విద్యార్థులకు కాలేజీల ప్రాంగణంలోనే హెచ్ఐవి పరీక్షలు, కౌన్సెలింగ్ సేవలు అందించనుంది.
కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్శిటీ, కాలేజీల విద్యా శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. విద్యార్థుల గోప్యతకు పూర్తి గౌరవం ఇస్తామని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ప్రయోజనం కోసం ‘నో యువర్ హెచ్ఐవి స్టేటస్’ అనే క్యూఆర్ కోడ్ యాప్ను డెవలప్ చేయనున్నారు.
గతంలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా అన్ని ఉన్నత విద్యా సంస్థలను హెచ్ఐవిపై అవగాహన కల్పించాలని కోరాయి. ఈ చొరవలో భాగంగా టెస్టులు, కౌన్సెలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తగా పలు కాలేజీల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.
మూడో స్థానంలో కర్ణాటక :
ఈ ప్రణాళికకు సహకరించాలని ఆరోగ్య శాఖ అన్ని కాలేజీల ప్రిన్సిపాల్లను ఆదేశించింది. విద్యార్థులలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ గణాంకాల ప్రకారం.. హెచ్ఐవి సోకిన వారి సంఖ్యలో కర్ణాటక దేశంలో మూడో స్థానంలో ఉంది.
Read Also : NEET-Supreme Court : నీట్ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అరెస్టైన విద్యార్థులకు భారీ ఊరట!
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రకారం.. కర్ణాటకలో మొత్తం 2,60,000 మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. వీరిలో, సుమారు 54వేల మందికి తమ హెచ్ఐవీ వ్యాధి ఉందనే తెలియదు. రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల రోగులు 7వేలు మంది ఉన్నారు.
18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయస్సు వారిలో ఈ సంక్రమణ వేగంగా వ్యాపిస్తోందని గణాంకాలు చూపిస్తున్నాయి. 2023-24లో ఈ వయస్సు వర్గంలో 44,500 మందికి హెచ్ఐవి ఉన్నట్లు నిర్ధారణ కాగా, ఈ సంఖ్య 2025-26 నాటికి 66వేలకు పెరుగుతుందని అంచనా.
నివేదికల ప్రకారం.. అసురక్షిత లైంగిక సంబంధాలు, మాదకద్రవ్యాల వాడకం హెచ్ఐవి కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తేలింది. అందుకే ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి, అది తీవ్రరూపం దాల్చకుండా నివారించేందుకు కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
