Sai Pallavi : మళ్ళీ బిజీ అవుతున్న సాయి పల్లవి.. లైనప్ మాములుగా లేదుగా..
తండేల్, అమరన్ పాన్ ఇండియా హిట్స్ తర్వాత సాయిపల్లవి లైనప్‌లో ఇంట్రస్టింగ్ సినిమాలు చేరుతున్నాయి. (Sai Pallavi)
Sai Pallavi
Sai Pallavi : సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు హీరోయిన్లకి వర్సటాలిటీ చూపించే అవకాశం ఉండదు. కెరీర్ మొదట్లో ఎలాంటి సినిమాలు చేస్తే అదే జోనర్‌కే ఎక్కువుగా పరిమితం చేస్తుంటారు మేకర్స్. కానీ ఈ విషయంలోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు సాయిపల్లవి. మొదట్లో వరుస సినిమాలు చేసిన సాయి పల్లవి గత కొన్నాళ్లుగా చాలా నిదానంగా కొత్త కొత్త పాత్రలతో సినిమాలు చేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం సౌత్ టు నార్త్ బిజియెస్ట్ హీరోయిన్గా మారుతుంది.
ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ ఎందరున్నా సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అనిపించే సాయిపల్లవికి జనాల్లో ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఇప్పటివరకు పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ మీడియం హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న సాయిపల్లవి త్వరలో వెండితెర సీతమ్మగా మెప్పించేందుకు ఆడియెన్స్ ముందుకొస్తున్నారు. ఈ దీపావళికి థియేటర్స్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతోన్న మైథలాజిక్ విజువల్ వండర్ రామాయణ సినిమాలో సీతమ్మగా సాయిపల్లవి పర్ఫార్మెన్స్పై అందరిలో అంచనాలు ఉన్నాయి.
Also Read : Rao Bahadur OTT : ఓటీటీలోకి సత్యదేవ్ ‘రావు బహదూర్’.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?
తండేల్, అమరన్ పాన్ ఇండియా హిట్స్ తర్వాత సాయిపల్లవి లైనప్‌లో ఇంట్రస్టింగ్ సినిమాలు చేరుతున్నాయి. ఓ పక్కన రామాయణ సినిమాతో రాబోతున్న సాయి పల్లవి నెక్స్ట్ సినిమాలు కూడా షూటింగ్ మొదలుపెట్టింది. విజయ్ సేతుపతి, సాయిపల్లవి లీడ్ రోల్స్‌లో సినిమా అంటూ చాలా కాలంగా అభిమానుల్ని ఊరిస్తూ వచ్చిన డైరెక్టర్ మణిరత్నం రీసెంట్గా ఈ సినిమాని పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాని కేవలం 40 రోజుల్లో పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారట మణిరత్నం.
దాంతో పాటు సాయిపల్లవి ధనుశ్ హీరోగా తెరకెక్కుతోన్న ఓం అనే పాన్ ఇండియా సినిమాలో పవర్ఫుల్ పోలీస్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. వీటితో పాటు కల్కి2లో దీపికా పదుకొన్ తప్పుకోవడంతో ఆ పాత్రను సాయిపల్లవితో రీప్లెస్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అలాగే నేను శైలజా ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల పురాణాలకి సంబంధించి ఓ వుమెన్ ఓరియెంటెడ్ కథకు సైతం సాయిపల్లవి ఓకే చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే రాఘవ లారెన్స్ 30వ సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి.
ఇలా రామాయణ, ఓం, మణిరత్నం సినిమా, లారెన్స్ సినిమా, కల్కి 2 సినిమా, కిశోర్ తిరుమల సినిమాలతో సాయి పల్లవి ఫుల్ బిజీగా ఉంది. మొదట్లో చిన్న సినిమాలు సైతం చేసిన సాయి పల్లవి ఇప్పుడు అన్ని భారీ సినిమాలే చేస్తుంది. ఆమె బిజీ అయి త్వరలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
