Viral Video : బిడ్డ‌ను కాపాడుకునేందుకు.. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి మెట్రో ట్రాక్ పైకి దూకిన త‌ల్లి.. ఆ త‌రువాత

ఈ సృష్టిలో అమ్మ ప్రేమ వెల‌క‌ట్ట‌లేనిది. త‌న బిడ్డ‌కు చిన్న క‌ష్టం వ‌స్తేనే త‌ల్ల‌డిల్లిపోతుంది.

Pune woman jumps onto metro tracks to save her child

Viral Video : ఈ సృష్టిలో అమ్మ ప్రేమ వెల‌క‌ట్ట‌లేనిది. త‌న బిడ్డ‌కు చిన్న క‌ష్టం వ‌స్తేనే త‌ల్ల‌డిల్లిపోతుంది. అలాంటిది బిడ్డ ప్రాణాల‌కు ఆప‌ద వ‌స్తే ఊరుకుంటుందా..? ఎంత దూరం అయినా వెలుతుంది. త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి అయినా స‌రే బిడ్డ‌ను కాపాడుకోవాల‌ని అనుకుంటుంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచే ఓ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని పుణెలో చోటు చేసుకుంది. మెట్రో స్టేష‌న్‌లో ఓ చిన్నారి ఆడుకుంటూ మెట్రో ట్రాక్ ప‌ట్టాల‌పై ప‌డ‌గా.. ఆ చిన్నారిని ర‌క్షించేందుకు త‌ల్లి సైతం మెట్రో ట్రాక్ ప‌ట్టాల‌పై దూకింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి.. సివిల్ కోర్టు మెట్రో స్టేషన్‌లో ఓ చిన్నారి ప్లాట్‌ఫామ్‌పై ప‌రుగెడితూ అంచుపై నుంచి జారీ మెట్రో ప‌ట్టాల‌పై ప‌డింది. ఇది చూసి భ‌య‌ప‌డిన చిన్నారి త‌ల్లి ప‌ట్టాల‌పైకి దూకేసింది. దీన్ని చూసిన అక్క‌డ ఉన్న ప్ర‌యాణీకులు వెంట‌నే వారికి సాయం చేయ‌డానికి ప‌రుగెత్తారు.

Star Mark On RS 500 Notes : 500 రూపాయ‌ల నోట్ల పై న‌క్ష‌త్రం గుర్తు.. అవి న‌కిలీవా..? నిజ‌మెంత‌..?

అదే స‌మ‌యంలో స్టేష‌న్‌లోని సెక్యూరిటీ గార్డు వికాస్ బంగర్ ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కి ఎదురుగా వ‌స్తున్న రైలును ఆపాడు. దీంతో మెట్రోస్టేష‌న్‌కు 30 మీట‌ర్ల దూరంలో రైలు ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికి ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాగా.. చిన్న పిల్ల‌ల‌తో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు వారి త‌ల్లిదండ్రులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పుణె మెట్రో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.