Punjab Grenade Blast Near Pathankot Army Camp
Punjab : పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఆర్మీక్యాంప్ సమీంలో గ్రనేట్ పేలుడు సంభవించింది. సోమవారం (నవంబర్ 22)వ తేదీన తెల్లవారుజామున ఆర్మీక్యాంప్ సమీపంలోని త్రివేణి గేట్ వద్ద ఈ గ్రనేడ్ పేలుడు సంభవించింది. వెంటనే సైన్యం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలిన గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గ్రనేడ్ పేలుడుకు సంబంధించి ఆధారాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు పాల్పడిందెవరనే కోణంలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరిశీలిస్తున్నారు. 2021 జూన్‌లో అత్యంత పటిష్ట భద్రత ఉండగా.. జమ్ము ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పేలుళ్లు సంభవించాయి. డ్రోన్‌తో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో బాంబులను పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు కూడా గాయపడ్డారు. పఠాన్ కోట్‌లో పేలుడు ఘటనతో జమ్ము ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్ము-పఠాన్ కోట్ హైవేపై పలు ప్రాంతాల్లో చెక్ పాయింట్లను భద్రతా దళాలు ఏర్పాటు చేశాయి. హైవే మీదుగా వెళ్లే ప్రతి వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేస్తున్నారు.
Read Also : Anantapuram : అనంత జిల్లాలో తప్పిన పెను ప్రమాదం-30 మంది మహిళలు సురక్షితం