Punjab Polls: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారు – రాహుల్ గాంధీ

కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారని అంటున్నారు రాహుల్ గాంధీ. వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. దాని కంటే ముందు.. గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు.

Punjab Polls: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారు – రాహుల్ గాంధీ

Rahul Gandhi

Updated On : January 27, 2022 / 8:47 PM IST

Punjab Polls: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారని అంటున్నారు రాహుల్ గాంధీ. వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. దాని కంటే ముందు.. గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. పార్టీ అభ్యర్థులను దుర్గైనా టెంపుల్, భగవాన్ వాల్మీకి తిరాత్ స్థల్ వేదికగా కలిశారు.

ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ ను పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్, పార్టీ స్టేట్ యూనిట్ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ, ఉప ముఖ్యమంత్రులు సుఖ్జీందర్ సింగ్ రాంధ్వా, ఓపీ సోనీలు స్వాగతం పలికారు.

సీఎం పదవి ఎవరికి దక్కినా అందరూ సహకరిస్తారని.. చన్నీ, సిద్దూ తనకు ముందుగానే హామీ ఇచ్చారని రాహుల్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీసీసీ సిద్ధూ తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 20న జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ 109మంది అభ్యర్థులను ప్రకటించింది. ఎనిమిది సీట్ల కోసం అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

 

Read Also : మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు.. ఆమె కోసం పోలీసుల వేట

ఎలక్షన్ కమిషన్ ఫిజికల్ ర్యాలీలు, రోడ్ షోలను పొడిగిస్తూ.. జనవరి 31 వరకూ జరగకూడదని నిర్ణయం తీసుకుంది.