జాట్లు, పంజాబీలకు బుర్రలు లేవు..బెంగాలీలు స్మార్ట్ : త్రిపుర సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : July 21, 2020 / 09:46 AM IST
జాట్లు, పంజాబీలకు బుర్రలు లేవు..బెంగాలీలు స్మార్ట్ : త్రిపుర సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

Updated On : July 21, 2020 / 11:23 AM IST

జాట్లు, పంజాబీలు బలవంతులే కానీ…మెదడు ఎక్కువగా పనిచేయదంటూ..త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాల మండిపడ్డారు.

సిగ్గు చేటని, బీజేపీ మైండ్ సెట్ ఇదేనంటూ దుయ్యబట్టారు. హర్యానీ సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. పంజాబ్ లోని సిక్కు సోదరులు, హర్యానాలో జాట్ సామాజిక వర్గాన్ని అవమానించారని, వారికి తెలివితేటలు లేదనడం..అన్నారు.

ఇదే బీజేపీ అసలైన ఆలోచన విధానమన్నారు. ఖట్టార్, దుష్యంత్ లు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ? బీజేప అధిష్టానం ఏమి చేస్తుంది ? అంటూ ప్రశ్నలు కురిపించారు. బీజేపీ అధిష్టానం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సూర్జేవాల విమర్శలు గుప్పించారు.

అసలు ఏమన్నారు : –
పంజాబీల గురించి మాట్లాడాల్సి వస్తే వారిని సర్దార్‌ అంటాం. వారికి తెలివి తక్కువగా ఉన్నా శారీరకంగా దృఢంగా ఉంటారు. కాబట్టి వారిని ప్రేమ, ఆప్యాయతలతో మాత్రమే గెలవగలం. హర్యానాలో చాలా మంది జాట్లు ఉన్నారు. వారికి మెదడు సరిగా పనిచేయదు. అయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు. తెలివితేటల్లో బెంగాలీలతో వారు సరితూగలేరు. బెంగాలీలు తెలివైనవారని భారతదేశమంతటా గుర్తింపు ఉంది అంటూ త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పలు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.