స్వచ్ఛమైన గాలి కోసం : ఢిల్లీలో స్మాగ్ టవర్..విశేషాలు

దేశ రాజధానిని కాలుష్యం వీడడం లేదు. ప్రమాదకరస్థాయిలో వెదజల్లుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వచ్చమైన గాలి పీల్చడానికి వీలు లేకుండా పోతోంది. దీని కారణంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా..అంతగా తీరడం లేదు. దీంతో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెంపరేచర్స్ కూడా తగ్గిపోతున్నాయి.
తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం..పొగమంచు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంపీ, బీజేపీ నేత, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈ సమస్యపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అత్యంత రద్దీగా పిలవబడే..లజ్ ఫత్ నగర్ సెంట్రల్ మార్కెట్‌లో స్మాగ్ టవర్ గంభీర్ సహకారంతో ఏర్పాటు చేశారు. స్థానిక ట్రేడర్స్ అసోసియేషన్ లజ్ పత్ నగర్ ప్రతినిధులు..ఈ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన స్మాగ్ టవర్ గంభీర్ లాంఛనంగా ప్రారంభించారు.
దీని విశేషాలు :
* స్మాగ్ టవర్ ఎత్తు 20 అడుగులుగా ఉంది.
* నాలుగు అడుగుల వేదిక మీద దీనిని నిర్మించారు.
* రోడ్డుపై నుంచి చూస్తే..టవర్ ఎత్తు 24 అడుగులుగా ఉంటుంది.
* టవర్ నిర్మాణానికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
* గౌతం గంభీర్ ఫౌండేషన్ ఈ వ్యయాన్ని భరించింది.
* టవర్ నిర్మించిన స్థానం నుంచి చుట్టుపక్కల 750 మీటర్ల పరిధి మేర ఉన్న గాలిని ఈ స్మాగ్ టవర్ శుద్ధి చేస్తుంది.
* ఇదే చైనాలో కూడా ఉంది. షాంఘైలో 328 అడుగుల ఎత్తున్న స్మాగ్ టవర్‌ను నిర్మించారు.
Read More :18వ రోజు : రాజధాని బంద్